పవన్ నిర్ణయంతో కసితో రంగంలోకి ఫ్యాన్స్!(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఎత్తులు, పై ఎత్తులతో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్న ఎన్నికల రణరంగంలోకి దూకడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎన్నికల్లో పోటీకి దూరంగానే ఉండాలని నిన్న మొన్నటి వరకు 'జనసేన' పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ తాజాగా ఆయన నిర్ణయం మార్చుకున్నారు. కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల్లో 'జనసేన' పార్టీ పోటీ చేయడం లేదనే కారణంగా ఇంతకాలం నిరాశతో కూరుకుపోయిన అభిమానులకు పవన్ కళ్యాణ్ నిర్ణయం మంచి ఊపు నిచ్చినట్లు అయింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై కసిగా ఉన్న వారు పవన్ కళ్యాణ్ నిర్ణయంతో....'జనసేన'పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగుతున్న వారి తరుపున ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల రంగంలోకి దిగితే ఎన్నికల రణరంగం మరింత రస వత్తరంగా మారుతుంది, ఎలక్షన్ వార్... జోరు జోరుగా ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రసాద్ వి పొట్లూరి

ప్రసాద్ వి పొట్లూరి

పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అయిన సినీ నిర్మాత ప్రసాద్ వి పొట్టూరి పోటీకి దిగుతున్నారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుండి ఆయన పోటీకి దిగే అవకాశం ఉంది.

మరో ఏడుగురు

మరో ఏడుగురు

పొట్లూరితో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు స్వతంత్రంగా అసెంబ్లీ స్థానాలకు బరిలోకి దిగనున్నారట.

పవన్ కళ్యాణ్ ప్రాచారం

పవన్ కళ్యాణ్ ప్రాచారం

వీరి తరుపున పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ప్రచారం చేయనున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక ప్రక్రియలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో....వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

పార్టీలో కీలక వ్యక్తి

పార్టీలో కీలక వ్యక్తి

పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జన సేన' పార్టీకి సంబంధించిన వారిలో నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి ప్రముఖుడు. పార్టీకి సంబందించిన అన్ని కార్యక్రమాలు ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహించిన సభల్లో ప్రసాద్ వి పొట్లూరి క్షేత్ర స్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X