twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామెన్‌ గంగతో...'ఐటం సాంగ్ కి ఆ లాటిన్ సాంగ్ ప్రేరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంలో సూపర్ హిట్ లాటిన్ అమెరికన్ పాప్ సాంగ్ 'Riva Riva Rivala Matha'ని ఎడాప్ట్ చేసారు. ఈ పాట పబ్ సాంగ్ గా వస్తుందని తెలుస్తోంది. విలన్స్ ని పవన్ కొడుతూండగా...బ్యాక్ గ్రౌండ్ లో స్కార్లెట్‌ విల్సన్‌ డాన్స్ చేస్తూంటుంది.

    ఇక ఈ పాటని సారధి స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే . ఆ సాంగ్ తో పవన్‌తో కలిసి విదేశీ నర్తకి స్కార్లెట్‌ విల్సన్‌ ఆడిపాడింది. ఆమె డాన్స్ కు ముగ్దుడైన పూరీ చివరి రోజున ఓ కాస్ట్ లీ ఐ ఫోన్ 4S ని గిప్ట్ గా ఇచ్చారు. ఈ పాట సినిమాలో హైలెట్ అవనుందని సమాచారం.ఇక శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్‌ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్‌ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్‌ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

    పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారు. అక్కడ ఆయన తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ దర్శకుడు పూరి జగన్నాధ్ కొన్ని ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజుతో టాకీ పార్టు దాదాపు పూర్తయ్యినట్లే అని చెప్తున్నారు. కొన్ని పాటలు మినహా షూటింగ్ పూర్తైపోయింది.

    ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

    English summary
    Music director Mani Sharma has adapted the tune of the famous Latin American pop song 'Riva Riva Rivala Matha' for Pawan Kalyan's upcoming film Cameraman Ganga tho Rambabu pub song, which has Pawan bashing up the villains with Sacrlett Wilson dances in the background. The audio of the film is expected to be launched in September while the movie release would be in October. Tamannaah is playing the female lead in this film, which also stars Prakash Raj, Nazar, Kota Srinivasa Rao, Ali etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X