పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' రిలీజ్ డేట్ అదే రోజు ఫిక్స్ చేసారా?
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం 2012 సంక్రాంతికి అంటే జనవరి 12 న విడుదల చేయాలని నిర్ణయించారని వినపడుతోంది.ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచాలని పూర్తిగా స్క్ర్రిప్టు పనిలో బిజీగా దర్శకుడు హరీష్ శంకర్ ఉన్నారు.మిరపకాయ విజయంతో ఆయన్ని ఈ చిత్రం వరించింది.ఇక పవన్ మాత్రం కూల్ గా తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్సకత్వంలో షాడో చిత్రం చేస్తున్నాడు.
ఆల్రెడీ హిందీ లవ్ ఆజ్ కల్ రీమేక్ తీన్ మార్ చేసి ఉండటంతో వెంటనే మరో రీమేక్ అంటే పద్దతిగా ఉండదని గ్యాప్ కోసం ఈ చిత్రం చేస్తున్నాడు.అందులోనూ తెలుగు నేటివిటి కోసం దబాంగ్ లో చాలా సీన్స్ మార్చాల్సి రావటంతో కూడా చాలా సమయం పట్టేటట్లు ఉంది.దాంతో షాడో పూర్తయ్యాకే ఈ చిత్రం కు వస్తాడు పవన్ .అప్పుడు ప్రారంభిస్తే వచ్చే సంవత్సరమే రిలీజ్ అంటున్నారు.అంతేగాక నైజాం ఏరియాలో జనం చాలా మంది దబాంగ్ ని చూసి ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమంటున్నారు.


Click it and Unblock the Notifications











