పవన్ సినిమా క్లైమాక్స్ కు వచ్చేసింది

By Srikanya

హైదరాబాద్ : కిషోర్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ముఖ్య భూమిక పోషిస్తోంది. శరత్‌మరార్‌, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇటీవల హైదరాబాద్‌ శివార్లలో క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కించారు. వెంకటేష్‌, శ్రియ, మిథున్‌ చక్రవర్తి తదితరులపై చిత్రీకరణ జరిపారు. త్వరలో మరో షెడ్యూల్‌ షూటింగ్ మొదలవుతుంది.

దర్శకుడు కిషోర్‌ పార్థసాని(డాలీ) మాట్లాడుతూ... " అప్పుడప్పుడు మాటల సందర్భంలో 'మీకు సమాధానం చెప్పాలంటే ఆ దేవుడే దిగిరావాలి బాబూ...' అంటుంటాం సరదాగా! అయితే నిజంగానే ఒక భక్తుడి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఆ దేవుడు దిగొచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణావతారంలో. మరి కళ్లముందు కనిపించిన ఆ దేవుడితో భక్తుడు ఏం మాట్లాడాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే" అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''దేవుడినే సవాల్‌ చేసిన ఓ భక్తుడి కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి పంచే వినోదాలు అందరికీ నచ్చుతాయి''అని చెప్తున్నారు.

Pawan Kalyan's Gopala Gopala latest info.

సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీక్షాపంథ్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.

ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, శరత్‌మరార్‌. సురేష్‌బాబు నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X