‘హరిహర వీరమల్లు’ టీజర్‌ అప్పుడేనట: వైరల్ అవుతోన్న ఇంట్రెస్టింగ్ న్యూస్

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒకటి పట్టాలపై ఉండగానే ఏకంగా మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడాయన. అందులో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' ఒకటి. పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమా మొగలాయీల కాలం నాటి కథతో రూపొందుతోంది. కోహినూర్ డైమండ్ ఇందులో ప్రధానాంశం కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ టీజర్ గురించి అప్పుడే ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోన్న తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన టీజర్‌కు అప్పుడే డేట్ ఫిక్స్ చేసేశారట. అది ఎప్పుడో కాదు.. పవర్ స్టార్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 అని అంటున్నారు. అవును.. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఈ టీజర్ గురించి ప్రచారం జరుగుతోంది. దీన్నే మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ వార్తపై సినీ యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Pawan Kalyans Harihara Veeramallu Teaser will be Release on Sep 2nd

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X