పవన్ కల్యాణ్ హెల్త్‌పై లేటేస్ట్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనావైరస్ బారిన పడ్డారనే వార్త అభిమానులను, పార్టీ కార్యకర్తలను, సన్నిహితులు, స్నేహితులు, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనలకు గురిచేసింది. తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలగానే పవన్ కల్యాణ్ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తూ ట్రీట్‌మెంట్ తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వెల్లడించిందేమంటంటే..

ఎన్నికల ప్రచారంలో బీజీగా
ఏప్రిల్ నెలలో పవన్ కల్యాణ్ పార్టీ వ్యవహారాల పరంగా, తన సినిమా వకీల్ సాబ్ విషయంలోను బీజీగా ఉన్నారు. తిరుపతి లోక్‌సభ ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయానికి కృషి చేశారు. అలాగే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతలు, ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో పవన్ కల్యాణ్‌కు కరోనావైరస్ సోకింది.

తాజా పరీక్షల్లో నెగిటివ్
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కోలుకున్నారు అని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా బారినపడిన పవన్ కల్యాణ్‌కు వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే కరోనా అనంతరం వచ్చే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ప్రకటనలో తెలిపారు.

ఆరోగ్యపరంగా సమస్యలు లేవని..
అయితే ఆరోగ్యపరంగా పవన్ కల్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన ఆరోగ్యం బాగుందని ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు అని పార్టీ నేత హరిప్రసాద్ వెల్లడించారు.
Recommended Video

అభిమానులకు, కార్యకర్తలకు థ్యాంక్స్
ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దని చెప్పారు అని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











