twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆవేదన చెందాను: హార్ట్ టచింగా స్పందించిన పవన్ కళ్యాణ్!

    సినారె మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు జాతికే కాదు, యావత్ సాహితీ లోకానికి తీరని లోటన్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విశ్వంభరునికి అశ్రునివాళి అంటూ ప్రముఖ కవి, సినీ గేయరచయిత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి నారాయణ రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్ట్ టచింగ్‌గా సంతాపం వ్యక్తం చేశారు.

    సినారె మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన మరణం తెలుగు జాతికే కాదు, యావత్ సాహితీ లోకానికి తీరని లోటు, తెలుగు సినిమా పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానం భర్తీచేయలేనిదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఆదర్శప్రాయుడు అని తెలుసుకున్నాను

    ఆదర్శప్రాయుడు అని తెలుసుకున్నాను

    సి. నారాయణరెడ్డి గారి జీవితం గురించి సినీ పెద్దల ద్వారా, కొన్నిరచనల ద్వారా తెలుసుకున్నపుడు శ్రీ నారాయణ రెడ్డి సదా ఆదర్శప్రాయుడు అని భావించాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

    తెలుగుభాష కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు

    తెలుగుభాష కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు

    విశ్వంభర రచన ద్వారా జ్ఞానపీఠ్ అవార్డు అందుకుని తెలుగు భాష కీర్తిని విశ్వవ్యాపితం చేశారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు, రాజ్యాంగ పదవులు ఆయనలోని పెంచాయి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

    సాహితీ వ్యవసాయం చేశారు

    సాహితీ వ్యవసాయం చేశారు

    తండ్రి వ్యవసాయం చేస్తే... సినారె సాహితీ వ్యవసాయం చేసి తెలుగు జాతికి సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహితీ స్రష్ట మరణించారని తెలిసి తీవ్ర ఆవేదన చెందాను అంటూ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

    నా ప్రగాఢ సానుభూతి

    నా ప్రగాఢ సానుభూతి

    సినారె భౌతికంగా లేక పోయినా ఆయన వెదజల్లిన సాహిత్య సౌరభాలు మన మధ్య చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను....ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

    English summary
    Pawan Kalyan who is a literary lover and follower of CiNaRe’s literary works sent a touching note on the demise of CiNaRe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X