»   »  హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్

హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్ ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్ ఏంటో తెలుసా? ఆపిల్ కంపెనీ రూపొందించిన ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ పవన్ ఉపయోగిస్తున్నారు.

ఈ ఫోన్ కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మరింత యాక్టివ్ అయ్యారని, దీని ద్వారా ఆయన సులభంగా ట్వీట్లు చేస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సంగీతం వినడం, పుస్తకాలు చదవడాన్ని బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఈ ఫోన్ కొన్న తర్వాత మరింత సౌకర్యంగా ఫీలవుతున్నారని టాక్.

తాను ఇష్టపడే, చదవాలనుకున్న పుస్తకాలను పీడీఎఫ్ ఈ బుక్స్ రూపంలో ఫోన్ లో లోడ్ చేసుకుని సమయం దొరికినప్పుడల్లా సులభంగా చదివేస్తున్నారట. ఐట్యూన్స్ ఉపయోగించి సంగీతం వినడం లాంటివి చేస్తున్నారట.

 ఇంతకీ ఈ ఫోన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కొన్నారో తెలుసా?

ఇంతకీ ఈ ఫోన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కొన్నారో తెలుసా?

తన భార్య అన్నలెజెనివాతో కలిసి ఆ మధ్య ఆస్ట్రేలియా వెళ్లినపుడు పవన్ ఈ ఫోన్ కొన్నారట. అప్పటి నుండి ఎంతో ఇష్టంగా ఈ ఫోన్ వాడుతున్నారట. సన్నిహితులకు, కుటుంబ సభ్యలకు ఏదైనా మెసేజ్ పంపాలంటే దాన్ని ఓ పేపర్ మీద రాసి, ఫోటో తీసి పంపుతారట పవన్ కళ్యాణ్.

 పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా' (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా' (ఫోటోస్)

అన్నా లెజెనివా ద్వారా పవన్ కళ్యాణ్ మరో పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పేరు పోలెనా... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోవాలనుకున్నాడట. కానీ పరిస్థితుల ప్రభావంతో ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 జనసేన ‘దేశ్ బచావో' ఆల్బం వెనక 19 ఏళ్ల కుర్రాడు, ఆశ్చర్యకర విషయాలు!

జనసేన ‘దేశ్ బచావో' ఆల్బం వెనక 19 ఏళ్ల కుర్రాడు, ఆశ్చర్యకర విషయాలు!

‘దేశ్ బచావో' ఆల్బం రూపకలప్పన వెనక ఓ 19 ఏళ్ల కుర్రాడు ఉన్నాడంటే నమ్మగలరా? అతని పేరే డీజే పృథ్వీ సాయి. ఆసియాలోనే అతిపిన్న వయస్కుడైన డీజేగా పృథ్వీ చరిత్రకెక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar source said that, Pawan Kalyan owns an iPhone 6+ that was brought in Australia during his recent visit to the country where his in-laws stay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu