twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ రాసిన 'ఇజం' పుస్తకం టీజర్ (లింక్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: జనసేన పార్టీ ఐడియాలజీతో ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. 'ఇజం' పేరుతో రెడీ అయిన ఈ పుస్తకాన్ని పవన్‌కల్యాణ్‌ ఈ నెల 25 న విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు పుస్తకం టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ లింక్ ఇదే..

    http://www.youtube.com/watch?v=c0JS7W1rQ_o#t=30

    తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఇజం పుస్తకం రాసారు. జనసేన పార్టీ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం రాసినట్టు తెలుస్తోంది. అన్ని పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకాన్ని దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పార్టీ పనుల్లో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. సామాజిక, రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు సాగనున్నారు. పార్టీలో చేరతామంటూ తమకు వేలాది ఫోన్లు వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది.

    Pawan Kalyan's ISM book promo

    ఇక పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన కొత్త పార్టీ జనసేన తన విధానాన్ని ప్రకటించింది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుందని వెల్లడించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని పేర్కొంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవుదినాలుగా పాటించాలని నిర్ణయించింది.

    జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టించినవే తప్ప జాతి సమగ్రత కోసం ఉద్దేశించినవి కావని జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయాల్లో నూతననాయకులను తయారుచేసే దిశగా పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని, సమాజంలో పునాది స్థాయినుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది కల్యాణ్‌ లక్ష్యమని స్పష్టం చేసింది.

    పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటికే వందల మంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్న జనసేన పార్టీ నెమ్మదిగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించింది.

    English summary
    As part of the Socio-Political agenda party chief Pawan Kalyan is releasing book on ideology of Jana Sena written 6 years ago which has been refined for years. Jana Sena is a serious political party with a long-term goal not for temporary electoral gains but socio-political aims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X