‘జన సేన’ వైజాగ్ మీటింగ్ (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జన సేన' పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ విశాఖపట్నంలోని ఇందిరాయ ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
విశాఖ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఫోటోల రూపంలో మీ ముందుకు తెచ్చాం. మధ్యాహ్న సమయంలో ఈ ఫోటోలు తీసిన సమయంలో అభిమానులు కొందరు మాత్రమే స్టేడియంలో ఉన్నారు. తొలుత షెడ్యూల్ ప్రకారం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుందని అనుకున్నప్పటికీ ఎండ కారణంగా సాయంత్ర 6 గంటలకు సభ ప్రారంభం కాలేదు.

జన సేన వైజాగ్ మీటింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.

జన సేన వైజాగ్ మీటింగ్ 2
అయితే సభ నిర్వాహకులకు కొందరు అగంతకుల నుండి బెదింపు కాల్స్ వచ్చాయి. సభలో అలజడి సృష్టిస్తామని వారు హెచ్చరించినట్లు సమాచారం.

జన సేన వైజాగ్ మీటింగ్ 3
బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఈ సభకు పోలీసులు భారీ భద్రత కల్పించారు

జన సేన వైజాగ్ మీటింగ్ 4
సభలోకి ఎంటరయ్యే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు వారిని సభా ప్రాంగణం లోనికి అనుమతిస్తున్నారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 5
క్రికెట్ మ్యాచ్ సమయంలో ఎలాంటి భద్రత ఉంటుందో....ఈ సభకు కూడా అలాంటి భద్రత ఏర్పాటు చేసారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 6
సభా ప్రాంగణంలో కూడా ఏం జరుగుతుందనే విషయాలను పోలీసులు కెమెరాల ద్వారా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయనున్నారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 7
బెదిరింపు కాల్స్ నిజమై ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎలా స్పందించాలనే విషయమై కూడా పోలసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 8
ఇక పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రైవేటు సిబ్బందితో పాటు పోలీసులు వలయంగా ఉండబోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఇప్పటికే అభిమానులు విశాఖ చేరుకున్నారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 9
"యూత్ ఆఫ్ ది నేషన్..ఫైట్ ఫర్ ది నేషన్''అనే నినాదంతో నిర్వహించే ఈ బహిరంగ సభలో రాసిన 'ఇజమ్' పుస్తకాన్ని విడుదల చేస్తారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 10
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభలో పురుషులు, మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.

జన సేన వైజాగ్ మీటింగ్ 11
ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు, లక్ష్యాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











