రాంగోపాల్ వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు.. దెయ్యమై వచ్చి పవన్‌ను పట్టుకుంటా.!

By Manoj

క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. మామూలు డైరెక్టర్ స్థాయి నుంచి బాలీవుడ్, హాలీవుడ్‌కు వెళ్లిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు హిందీలోనూ బడా హీరోలతో సినిమాలు చేశాడు. అయితే, కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం ఇటీవల వర్మ చేస్తున్న సినిమాలే. గతంలో కొన్ని జోనర్లను ఎంచుకుని సినిమాలు తీసిన ఈయన.. ఇప్పుడు మాత్రం సెన్సేషనల్ అయిన అంశాలనే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ సినిమాలన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. అదే సమయంలో కొందరికి విలన్‌గా మారుతున్నాడు. దీంతో తాజాగా వర్మను జనసేన పార్టీ కార్యకర్తలు చంపేశారు. వాళ్లు ఎందుకిలా చేశారు..? వివరాల్లోకి వెళితే...

అనుకున్నది సాధించాడు

అనుకున్నది సాధించాడు

రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'. వాస్తవానికి ఈ సినిమాను రెండు కులాలను బేస్ చేసుకుని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌తో రూపొందించాడు. దీంతో ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో వర్మ.. టైటిల్ మార్చడంతో పాటు కొన్ని సీన్స్ కట్ చేసి విడుదల చేశాడు.

 ఊహించని స్పందన

ఊహించని స్పందన

ఎన్నో వివాదాలు.. మరెన్నో హైడ్రామాల నడుమ విడుదలైన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాకు ఊహించని స్పందన వస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమాకు ఎంతో క్రేజ్ రావడంతో తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కల్పిత పాత్రలతో తెరకెక్కించిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

అందరినీ చూపించేశాడు

అందరినీ చూపించేశాడు

విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రముఖ పార్టీకి చెందిన అధ్యక్షుడు, ఆయన కుమారుడిని ఇందులో చూపించాడు వర్మ. అలాగే, ఓ మత ప్రబోధకుడిగా ఉండి కొన్నేళ్ల క్రితం పార్టీని స్థాపించిన వ్యక్తిని.. అలాగే, సినిమా నుంచి వెళ్లి పార్టీ ఏర్పాటు చేసిన సెలెబ్రిటీకి కూడా పాత్రను కేటాయించాడు.

వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రాంగోపాల్ వర్మను కోడూరుపాడుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు చంపేశారు. అంటే.. రియల్‌గా కాదు.. ఆయన చనిపోయినట్లు ఓ ఫ్లెక్సీని క్రియేట్ చేశారు. అందులో ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చేకూరకూడదని భగవంతుని ప్రార్ధిస్తున్నాము' అని పేర్కొన్నారు.

దెయ్యమై మీ నాయకుడిని పట్టుకుంటా

క్రేజీ డైరెక్టర్‌కు శ్రద్దాంజలి తెలుపుతున్నట్లు ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడంతో వర్మ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ ఫోటోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ సంచలన దర్శకుడు.. ‘మీ లీడర్‌ను దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా' అంటూ సదరు కార్యకర్తలను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

అమ్మ రాజ్యంలో ఎందుకు తీశాడో చెప్పాడు

అమ్మ రాజ్యంలో ఎందుకు తీశాడో చెప్పాడు

ఇదే ఫొటోను షేర్ చేస్తూ వర్మ మరో పోస్ట్ కూడా పెట్టాడు. ‘అమ్మ రాజ్యంలో సినిమాపై చెడు ప్రచారం చేస్తున్న వాళ్లందరూ అర్థం చేసుకోండి. ఈ సినిమా కేవలం ఫన్ కోసం తీసిందే. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు నాయకుల మీద ప్రేమతో కూడా. ఇది వాళ్ల ఫాలోవర్ల మీద ఒట్టేసి చెబుతున్నా. ముఖ్యంగా కొడుమూరుపాడు జనసేన కార్యకర్తలపై కూడా' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X