పీకలు కోస్తుంది.. బీ కేర్ ఫుల్: నాగబాబు వార్నింగ్
'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో వరుస వీడియోలు వదులుతున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, ఆయన జనసేన పార్టీకి మద్దతుగా మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా హిట్లర్ కథ గుర్తు చేస్తూ... పవన్ కళ్యాణ్, సేనసేన వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చారు.
సెకండ్ వరల్డ్ వార్ సమయంలో అడాల్ప్ హిట్లర్ అనే ఒక నరరూప రాక్షసుడు ఉండేవాడు. అతడికి కొన్ని ప్రచార సాధనాలు ఉన్నాయి. వీటి ద్వారా తన పార్టీ గురించి ఎక్కడలేని బిల్డప్పులు ఇచ్చుకునేవాడు. దానికి ప్రధాన సూత్రధారి అతడి ప్రచార శాఖకు సంబంధించిన మినిస్టర్ గోబెల్స్. హిట్లర్ గొప్పవాడు అని బిల్డప్పులు ఇవ్వడానికే అతడి పెట్టుకున్నాడు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి గోబెల్స్ తయారయ్యారని నాగబాబు అన్నారు.

తొక్కేయాలని నీచమైన ఆలోచనలు
ఆ రోజుల్లో గోబెల్ ప్రచారానికి ప్రజలు బాగా ఇన్ ఫ్లూయోన్స్ అయ్యేవారు. అపుడు సోషల్ మీడియా లేదు కాబట్టి గోబెల్స్ లాంటి గొట్టం గాళ్లకు చాలా ఈజీ అయింది. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి గోబెల్స్ చాలా మంది తయారయ్యారు. వాళ్లు జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు.

జెన్యూన్ పర్సన్
టీడీపీ వారు వైసీపీలో కలిసి పోయిందంటారు. వైసీపీ వారు టీడీపీతో కుమ్మక్కయిందంటారు. కొందరు బీజేపీతో అంటగడుతున్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్‌గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా? కళ్యాణ్ బాబు మీ లాగా కన్వెన్షనల్, క్రిమినల్, ఫ్యాక్షన్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు చేసే వ్యక్తి కాదు. మీ లాంటి ప్రభుత్వాలను ఏర్పరిచే వ్యక్తి కాదు. ఒక జెన్యూన్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలనుకుంటున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా ఉన్నాం
కళ్యాణ్ బాబు మీద మీరు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా కుదరదు. ఈ రోజు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొందరు సోషల్ మీడియాలో జనసైనికుల వాట్సాఫ్ గ్రూపులను డిలీట్ చేయడం లాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేరు. పనికి మాలిన న్యూస్ వేసుకోవడానికి మీకు ఎంత అవకాశం ఉందో.. మా వాయిస్ చెప్పుకోవడానికి సోషల్ మీడియా అంత అవకాశం ఇచ్చింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల గుండెల్లో కళ్యాణ్ బాబు స్థానాన్ని ఏమీ చేయలేరు. తాత్కాలికంగా మీరు ఇలాంటివి చేసి విజయం సాధించ వచ్చు. కానీ ఎక్కువ రోజులు ఇవి సాగవన్నారు.
పీకలు కోస్తుందంటూ వార్నింగ్
గాజు గ్లాసు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దాహం వేస్తే అందులో నీరు పోసుకుని దాహం తీర్చుకోవచ్చు. ఆ గ్లాసును కాపాడుకోవడం మన ధర్మం. మనకే మంచిది. గ్లాసు తన, పర, మంచి వాడు, చెడ్డవాడు అనే బేధం చూపించదు. ఇతడు ప్రతి పక్షం, అధికార పక్షం అనే ఆలోచన దానికి ఉండదు. అందరి దాహాన్ని చక్కగా తీస్తుంది. అందరికీ ఉపయోగపడుతుంది. ఒక వేళ మీరు గ్లాసుని పగలగొట్టాలని చూసినా.. పగిలినా ఆ గ్లాసు గాజుపెంకు ఆయుధంగా మారి పీకలు కోసే అవకాశం ఉంది. బీ కేర్ ఫుల్... అంటూ నాగబాబు హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











