పవన్ పాడిన పాట విడుదల...లింక్
హైదరాబాద్: పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న'కాటం రాయుడా ...కదిరి నరసింహుడా '
పాట అనుకున్నట్లుగానే ఈ రోజు ఉదయం విడుదలైంది. పవన్,త్రివిక్రమ్, బ్రహ్మానందం, దేవిశ్రీప్రసాద్ ..రికార్డింగ్ రూమ్ లో ఉండగా రికార్డు చేసారు. పవన్ చాలా ఉత్సాహంగా ఈ పాటను పాడారు. ఉత్తరాంధ్ర జానపద యాస లో సాగిన ఈ పాట సినిమాలో హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ పాట వైరల్ లా దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ తో సరదాగా ఓ బిట్ సాంగ్ పాడించాం. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేద్దామని, దాన్ని ఆల్బమ్‌లో చేర్చలేదు అంటూ చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల జరిగిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో బ్రహ్మానందం ఓ కామెంట్ చేసారు. అన్నీ పాటలు విడుదల చేసారు కానీ...ఒక సాంగును ఎందుకో ఆపేసారూ అని. విడుదల చేయని ఆ సాంగు ఏమిటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సాంగులో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని టార్గెట్ చేస్తూ పాడారు. ఇదే విషయాన్ని దేవి ఖరారు చేసారు.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సమంత, ప్రణీత నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారంతో తన పాత్ర డబ్బింగ్‌ను పవన్‌కల్యాణ్ పూర్తి చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ పనుల్ని జరిపేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.
"ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్.


Click it and Unblock the Notifications












