పవన్ పంజా ‘లెగ్’పవర్ ఇదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పంజా'. నవంబర్ 13న ఆడియో విడుదల చేసి డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా...యువన్ శంకర్ రాజ సంగీతం అందించారు. సినిమా విడుదలకు ముందే పంజాలోని పవన్ స్టిల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా పవన్ 'లెగ్" పవర్ ఎలా ఉంటుందో చూపించే ఫోటో ఒకటి విడుదలైంది. ఇందులో పవన్ తన లెగ్ తో విలన్లకు కిక్ ఇవ్వడం అదిరి పోయిందంటున్నారు అభిమానులు.
మరి ఫోటోల్లో ఉన్న దమ్ము సినిమాలో ఉంటుందా? లేక గతంలో కొన్ని సినిమా మాదిరి విడుదలకు ముందు బాగా అంచనాలు పెరిగేలా చేసి....తీరా విడుదలయ్యాక చతికిల పడదుకదా..?అని సందేహ పడేవారూ లేకపోలేదు. మరి ఏం జరుగబోతోందో.. సినిమా విడుదలైతేకానీ తెలియదు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్. తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ నిర్మాతలు.


Click it and Unblock the Notifications











