»   » పవన్ కళ్యాణ్ కొడుకు పేరు గురించి... మరీ ఇంత చీప్‌గానా?

పవన్ కళ్యాణ్ కొడుకు పేరు గురించి... మరీ ఇంత చీప్‌గానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా సెలబ్రిటీల స్క్రీన్ లైఫ్ మాత్రమే కాదు, వారి పర్సనల్ లైఫ్ కూడా ఎంతో ఆసక్తికరం. అందుకే ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షుకలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వారి విషయంలో ఇంట్రెస్ట్ పీక్ స్థాయిలో ఉంటుంది.

"The Dad Is Looking Unimaginably Cute." RGV FB Post On Pawan Kalyan

తాజాగా పవన్ కళ్యాణ్ నాలుగో బిడ్డకు తండ్రి అవ్వడం నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయింది. దీనిపై కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులు స్పందిస్తూ విష్ చేశారు.

పవన్ కొడుకు పేరు గురించి చీప్ చర్చ

పవన్ కొడుకు పేరు గురించి చీప్ చర్చ

పవన్ కళ్యాణ్ కొడుకు పేరు గురించి సోషల్ మీడియాలో చీప్ చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ హిందూ, ఆయన భార్య అన్నా లెజెనివా క్రిస్టియన్ కావడంతో వారికి పుట్టిన బిడ్డకు ఏ సాంప్రదాయం ప్రకారం పేరు పెడతారో అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

కుల, మత బేధాలు లేవని పవన్ ఎప్పుడో చెప్పాడు

కుల, మత బేధాలు లేవని పవన్ ఎప్పుడో చెప్పాడు

తనకు కులం, మతం, ప్రాంతం, వర్గం లాంటి భేదాలు లేవని, అన్నీ తనకు సమానమే అని పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి విశాలమైన వ్యక్తిత్వం ఉన్న పవర్ స్టార్ కొడుకు విషయంలో ఇలాంటి సంకుచితమైన చర్చ సాగడం నిజంగా విచారకరం.

ఇది పూర్తిగా వారి పర్సనల్, చర్చ అనవసరం అంటున్న ఫ్యాన్స్

ఇది పూర్తిగా వారి పర్సనల్, చర్చ అనవసరం అంటున్న ఫ్యాన్స్

తమకు పుట్టిన బిడ్డకు ఏ పేరు పెట్టాలనేది పూర్తిగా వారి పర్సన్ అంశం. దీని గురించి చర్చ అనవసరం. అసలు ఈ అంశాన్ని కులానికో, మతానికో ముడి పెట్టి చూడటం చాలా నీచం. దీని గురించి చర్చ అనవసరం అని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

అలాంటి ప్రభుద్దులు కూడా ఉంటారు

అలాంటి ప్రభుద్దులు కూడా ఉంటారు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఎదుగుతున్నందున ఈ అంశాన్ని రాజకీయంగా ముడి పెట్టి తమకు అనుకూలంగా వాడుకునే ప్రభుద్ధులు కూడా ఉంటారని, అలా ఎవరైనా చేస్తే తగిన బుద్ది చెబుతామని అంటున్నారు అభిమానులు.

గతంలో సెలబ్రిటీల పిల్లల పేర్ల విషయంలో వివాదాలు

గతంలో సెలబ్రిటీల పిల్లల పేర్ల విషయంలో వివాదాలు

గతంలో సినిమా సెలబ్రిటీల పిల్లల పేర్ల విషయంలో కొన్ని వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొడుకు పేరు వివాదం అవుతుందని కాదు కానీ.... ఈ విషయాన్ని కూడా కులాలకు, మతాలకు ముడి పెట్టి దీనిపై అనవసరం ఇష్యూ చేస్తున్న వారిని టార్గెట్ చేయడమే ముఖ్య ఉద్దేశ్యం.

పవన్ కళ్యాణ్ సంతానం

పవన్ కళ్యాణ్ సంతానం

పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా దంపతులకు మొదటి సంతానంగా పోలెనా జన్మించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ దంపతులు మరో మగబిడ్డకు జన్మనిచ్చారు.

అకీరా, ఆద్య

అకీరా, ఆద్య

మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు తమ తల్లితో కలిసి పూణెలోనే ఉంటున్నారు.

‘రెండో' కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

‘రెండో' కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

ఇటీవల పోలెనా పుట్టినరోజు వేడుక హైదరాబాద్ లో జరిగింది. చాలా సింపుల్ గా జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.

ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

ఆద్య పుట్టినరోజు

ఆద్య పుట్టినరోజు

మైడార్లింగ్ అంటూ రేణు దేశాయ్, కూతురు పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్

(ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Pawan Kalyan's new born son having a "Christian name" got wide attention. At the same time, it is drawing severe criticism from Pawan's die-hard fans who are against to few sections of media, individuals labeling the name as "Christian" or "Hindu".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu