పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది (న్యూ స్టిల్)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాకు సంబంధించి ఏ కొత్త విషయం బయటకు వచ్చినా అదో సెన్సేషనే. మరి పవర్ స్టార్ ఇమేజ్ రేంజి అలాంటిది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ న్యూస్టిల్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్టైల్ కేక అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన శుభం కార్డు సీన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీవీయాంకర్ గాయిత్రి భార్గవి ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి స్పందన వస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా పలు రికార్డులు నెలకొల్పిన ఈచిత్రం విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రీణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











