»   »  హాట్ టాపిక్.... పవన్ కళ్యాణ్ న్యూ హెయిర్ స్టైల్

హాట్ టాపిక్.... పవన్ కళ్యాణ్ న్యూ హెయిర్ స్టైల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైల్ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఖుషి, తమ్ముడు లాంటి చిత్రాల తర్వాత ఆయన హెయిర్ స్టైల్ యూత్ విపరీతంగా ఫాలో అయ్యారు. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ రోటీన్ హెయిర్ స్టైల్ లోనే కనిపిస్తున్నారు.

కానీ నెక్ట్స్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ పూర్తిగా డిఫరెంటుగా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోలో పవన్ కళ్యాణ్ హెయిర్ వైట్ అండ్ బ్రౌన్ కలర్లో....నిక్కబొడిచిన డిఫరెంటుగా ఉంది. పవన్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో ఇదే లుక్ తో ఆయన కనిపిస్తారని అంటున్నారు.

పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ఇది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 2 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

Pawan Kalyan's new hair style goes viral

మొదటి షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగనున్నట్టు తాజా సమాచారం. పవన్, సహా ఇతర కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి అనూప్ సంగీత దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. ఆకుల శివ కథ, మాటలు సమకూరుస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది హయ్యెస్ట్ అమౌంట్. మరి పవర్ స్టారా మజాకా!

English summary
Pawan’s latest photograph with a fan has been going viral since last night. In the photograph, Pawan is seen with a neatly trimmed hair colored with a golden brown shade. Whether this new look is for his upcoming film in the direction of SJ Suryah or not will be revealed once the shoot begins on June 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu