»   » పవన్ కళ్యాణ్ న్యూ ఆఫీస్ వివరాలు

పవన్ కళ్యాణ్ న్యూ ఆఫీస్ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో పవన్ కళ్యాణ్ సొంతగా సినిమా ప్రొడక్షన్ సంస్థను స్థాపించాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఆఫీసు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆఫీసు పూర్తిగా రెడీ అయిందని, త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో పవర్ ఫుల్ హీరో, 'త్రివిక్రమ్ శ్రీనివాస్'.. 'పంచ్ డైరెక్టర్'. వీరిద్దరూ కలిస్తే....టాలీవుడ్ చరిత్రలో సరికొత్త మైలు రాయి 'అత్తారింటికి దారేది'. దర్శకుడిగానే కాదు పవన్‌కు అత్యంత సన్నిహితంగా వారిలో త్రివిక్రమ్ ఒకరు. ఇప్పుడు వీరి ఫ్రెండ్షిప్ ఇంకా ముందుకెళ్లింది. ఇద్దరి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కొత్త కళాకారులకు, నటీనటులకు అవకాశాలిచ్చి తెలుగు తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారు.

'అత్తారింటికి దారేది' చిత్రంతో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ నెక్ట్స్ 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి 'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాత.

గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
Film Nagar sources said that, Pawan Kalyan’s new office is ready and set to begin its operations. Pawan has bought it in the MLA Colony in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu