కనీస స్పందన లేని పవన్-సర్వత్రా అసంతృప్తి
బహుషా ఇప్పటి వరకు ఏ హీరో సినిమా టైటిల్ చుట్టూ కూడా ఇన్ని రకాలుగా పుకార్లు తిరగలేదు కావచ్చు. కానీ పవర్ స్టార్ పవన్ క ళ్యాణ్ తాజా సినిమా టైటిల్ పై మాత్రం గత కొంత కాలంగా రకరకాలుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఏది నమ్మాలో అర్థం కాక అయోమయంలో పడి అసంతృకి గురవుతున్నారు అభిమానులు.
పవన్ కళ్యాన్ హీరోగా తమిళ తంబి విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఇప్పటి టైటిల్ మాత్రం ఖరారు కాలేదు. ఈ సినిమాకు 'షాడో" అనే టైటిల్ ఖరారు చేశారని కొంత కాలం ప్రచారం జరిగితే, 'కాళి" అనే టైటిల్ కన్ ఫర్మ్ చేశారని మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఇటీవల ఇవి రెండూ కాదు 'పవర్" అంటూ పుకారు లేచింది. తాజా మరో రెండు టైటిల్స్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు 'తిలక్" లేదా 'పటేల్" అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో? అసలు టైటిల్ ఇదే అని పవన్ లేదా దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించేదెప్పుడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











