Pawan Kalyan Vakeel Saab ప్రియురాలితో బైక్‌పై షికారు చేస్తున్న వకీల్ సాబ్.. సంక్రాంతికి ఫ్యాన్స్‌కు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ షూటింగు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ పవన్ కల్యాణ్ తరఫున న్యూ ఇయర్ స్పెషల్ లుక్‌ను విడుదల చేసింది. ఆ లుక్ గురించి మరిన్ని విషయాలు...
Recommended Video

శృతిహాసన్‌తో పవన్ కల్యాణ్
ఎన్నో బాధలను, అనుభవాలను తీసుకొచ్చిన 2020 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ.. 2021 సంవత్సరానికి వకీల్ సాబ్ యూనిట్ ప్రత్యేకమైన పోస్టర్‌తో స్వాగతం పలికింది. శృతిహాసన్‌తో బైక్‌పై రైడ్ చేస్తున్న పోస్టర్‌ను ప్రేక్షకులకు అందించింది. ఈ సందర్భంగా సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అభిమానులకు శుభవార్తను అందించింది.

మూడేళ్లపాటు టాలీవుడ్‌కు దూరం
జనసేన పార్టీ కోసం నటనకు దూరమైన పవన్ కల్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దాంతో టాలీవుడ్‌లో ఆయన నట జీవితానికి దాదాపు మూడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ సందర్భంగా తమిళ, హిందీ భాషల్లో విజయవంతమైన పింక్ సినిమాను రీమేక్‌గా వకీల్ సాబ్‌ను నిర్మాతలు దిల్ రాజు, బోని కపూర్ నిర్మించారు.

వకీల్ సాబ్ పాటకు ప్రేక్షకుల పట్టం
వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఓ పాటను మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన మగువా మగువా పాటకు విశేష స్పందన లభించింది. ఈ పాటకు ఇప్పటికే 39 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది.

వేసవిలో వకీల్ సాబ్ రిలీజ్
వకీల్ సాబ్ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలనే ప్రయత్నంతో నిర్మాతలు ముందుకెళ్లారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగు వాయిదా పడటంతో రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే లాక్‌డౌన్ అనంతరం డిసెంబర్ చివరి వారంలో పవన్ కల్యాణ్ తన షూటింగును పూర్తి చేసుకొన్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది.


Click it and Unblock the Notifications











