100 కోట్లతో పవన్ కల్యాణ్ సినిమా.. బల్గేరియాకు పవర్‌స్టార్..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. పవన్ కెరీర్‌లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సెట్టింగులు, హంగులు, ఆర్భాటాలతో ఈ సినిమ

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. పవన్ కెరీర్‌లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సెట్టింగులు, హంగులు, ఆర్భాటాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను వేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్, చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం.

బల్గేరియాకు వెళ్తున్న పవన్ టీమ్

బల్గేరియాకు వెళ్తున్న పవన్ టీమ్

ఇప్పటివరకు పవన్, త్రివిక్రమ్ సినిమా దాదాపు 60 శాతం పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే చేశారు. కానీ మిగితా కొంత మొత్తాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బల్గేరియాలో కొన్ని ప్రాంతాలను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.

 హ్యాట్రిక్ కోసం శరవేగంగా..

హ్యాట్రిక్ కోసం శరవేగంగా..

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల విజయం తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నది. కథాకు తగినట్టుగా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో నిర్మాత కూడా వెనుకాడకుండా డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తున్నది.

100 కోట్ల బడ్జెట్‌తో..

100 కోట్ల బడ్జెట్‌తో..

పవన్, త్రివిక్రమ్ సినిమా కోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ కెరీర్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా త్రివిక్రమ్ సినిమా కానున్నది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ టాక్ ఆఫ్ ధి ఇండస్ట్రీగా మారింది.

పవన్ ఆఫీస్ సెట్ కోసం రూ.1.5 కోట్లు

పవన్ ఆఫీస్ సెట్ కోసం రూ.1.5 కోట్లు

కథ కోసం దుబాయ్‌లో ఉండే భారీ భవనం సెట్‌ను వేయడం విశేషం. దుబాయ్‌లో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతానికి సంబంధించిన సెట్‌ కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది.
నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీ పడటం లేదనేది ప్రస్తుతం టాక్.

కళ్లు చెదిరిపోయే భవనం..

కళ్లు చెదిరిపోయే భవనం..

బిలియన్ డాలర్ల మేర వ్యాపారం చేసే కంపెనీల సముదాయంలో ఉండే పవన్ కల్యాణ్ ఆఫీస్ సెట్‌‌ను చాలా రిచ్‌గా డిజైన్ చేశారని, దాని కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారనేది టాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ భారీ భవనంపై ఏర్పాటు చేసిన లైటింగ్ తెరపైన అద్భుతంగా ఉంటుందని చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X