»   » అదైతేనే సేఫ్: పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎమోషన్స్

అదైతేనే సేఫ్: పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎమోషన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నష్టం చవిచూడాల్సి వచ్చింది. శరత్ మరార్ ను నష్టాల నుండి గట్టెక్కించేందుకు పవన్ కళ్యాణ్ అతనితోనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య చేతి నుండి డైరెక్టర్ డాలీ(కిషోర్ పార్ధసాని... గోపాల గోపాల ఫేం) చేతిలోకి వచ్చింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ రిజల్ట్ అంచనాలను తారుమారు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చాలా కేర్ తీసకుంటున్నారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విషయంలోనూ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా జాగ్రత్తగానే తీసినప్పటికీ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిస్సవ్వడమే దెబ్బతీసిందని భావించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం తాజా సినిమాలో అవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ డాలీ ఈ సినిమాను గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒక ఫ్యాక్షనిస్టుకి, అందమైన విలేజ్ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. సినిమా మొత్తం రూరల్ బ్యాక్ డ్రాపులో సాగుతుంది, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా మెచ్యూర్ గా డిజైన్ చేసారు.

స్లైడ్ షోలో మరిన్ని విషయాలు...

ఫ్యామిలీ ఎమోషన్స్

ఫ్యామిలీ ఎమోషన్స్


అత్తారింటికి దారేది సినిమాలో మాదిరిగా ఈసినిమాలోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండేలా స్క్రిప్టు సిద్ధం చేసారు.

అదే సేఫ్

అదే సేఫ్


సినిమా సేఫ్ గా గట్టెక్కాలంటే కమర్షియల్ అంశాలు, యూత్ కు నచ్చే స్క్రీన్ ప్లే తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండాలని భావిస్తున్నారు.

హీరోయిన్

హీరోయిన్


ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. శ్రుతి హాసన్ ను తీసుకుంటారా? లేక మరెవరినైనా తీసుకుంటారా? అనేది ఇంకా ఖరారు కాలేదు.

త్వరలో..

త్వరలో..


ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలొ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే వేసవికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పవన్-త్రివిక్రమ్

పవన్-త్రివిక్రమ్


ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

English summary
Highly placed sources informs Pawan Kalyan's upcoming flick under Dolly's Direction will have good family emotions. Pawan Kalyan's next is touted to be a love story between a Factionist & Village Belle. This film will have a rural backdrop and PK's role was designed in a matured manner. Just alike 'Atharintiki Daredi', Family Emotions have been given good importance in this venture.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu