పవన్ కల్యాణ్ ‘పంజా’ కౌంట్‌డౌన్ షురూ....

By Bojja Kumar

పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రూపొందిన సినిమా 'పంజా'. మరికొన్ని గంటల్లో పంజా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీంతో ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు అభిమానులు. ఎప్పడు తెల్లారుతుందా? ఎప్పడు థియేటర్లో పడదామా? ఎప్పడు పపర్ స్టార్ పంజా ను కళ్లారా వీక్షిద్దామా? అని ఎదురు చూస్తున్నారు.

పంజాలో పవన్ సరసన నాయికలుగా సారాజేన్ డయాస్, అంజలి లావణియా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. పవన్ కల్యాణ్ ఇందులో గడ్డంతో కొత్త గెటప్పులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు జైదేవ్. అంతా షార్ట్ కట్ లో జై...అని పిలుస్తుంటారు. చాలా కాలంగా సరైన హిట్ లేని పవన్ ఈ సారి తన పంజా పవర్ ఏమిటో రుచి చూపించాలనే కసిగా ఉన్నాడు.కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని విష్ణువర్థన్ తీర్చిదిద్దాడు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తుండగా, అడవిశేష్ విలన్ గా కనిపించబోతున్నాడు.

'క్రిష్', 'మై నేం ఈజ్ ఖాన్', 'త్రీ ఇడియట్స్' సినిమాలకి పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం వల్ల యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పవన్ ఖుషి, మెగాస్టార్ చూడాలని ఉంది సినిమాలు మంచి హిట్టయిన నేపథ్యంలో కోల్ కతా సెంటిమెంటు పంజాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మరో వైపు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం కేక పుట్టించే రేంజ్ లో హిట్టయింది. ఎక్కడ చూసినా పంజా పాటలే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కామెడీ స్టార్ బ్రహ్మానందంపై ఇందులో ప్రత్యేకంగా ఓ కామెడీ సాంగు డిజైన్ చేయడం, ఆ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బేనర్లపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, నీలిమా తిరుమలశెట్టి, ప్రసాద్ దేవినేని, నగేష్‌ ముంతా ఈ సినిమాని నిర్మించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X