నేనో క్రేజీ ఫెలోని....సాఫ్ట్‌ గా కనిపించి....నైసుగా కోసేస్తా....!

By Sindhu

సినిమాలో ఎటువంటి పాత్ర వేశామన్నది ముఖ్యం కాదు. మనకు బాగుందా లేదా అనేకంటే ప్రేక్షకులు నచ్చితేనే విలువుంటుంది' అని నూతన నటుడు అడవి శేషు చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'పంజా' చిత్రంలో నెగిటివ్‌ పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలో విడుదల కాబోతోంది. తను తెలుగువాడినని చెప్పగానే. ఆయన ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నారని చెప్పారు. 'పంజా'లో తనపాత్ర వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. కర్మ"తో హీరోగా, దర్శకుడిగా పరిచయమయ్యాను. ఆ సినిమా నాకు పరిశ్రమలో సులువైన ఎంట్రీనిచ్చింది. అందులోని కొన్ని సన్నివేశాలు, సహా పాటల్లో నా నటప్రదర్శన నచ్చి దర్శకుడు నన్ను ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కు ఎంచుకున్నారు. నిజానికి నాలాంటి కొత్తవారికి ఇంత పెద్ద అవకాశం రావడం..అరుదైన విషయం" అన్నారు అడివి శేషు.

ఆయన పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని 'పంజా"లో ప్రతినాయకుడిగా నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌ లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ..పైవిధంగా స్పందించారు. మరిన్ని సంగతులు చెబుతూ 'తొలి సినిమా తర్వాత వరుసగా 15 చిత్రాల్లో (అన్నీ ప్రేమకథలే) హీరోగా అవకాశమొచ్చింది. సినిమాలకైతే లోటు లేదు. కథే లోటు. అందుకే వదులుకున్నా. అవన్నీ ఒకే మూసలో ఉండటంతో కొంతకాలం వేచి ఉన్నాను. ఆ చిత్రం చూశాక అందరూ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ చేయమని సూచించారు. అయితే 'చేస్తే ఇలాంటి పాత్రలోనే చేయాలి" అన్నంత మంచి అవకాశం 'పంజా"తో వచ్చింది. పవన్‌ హీరోగా నటించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఓ విలక్షణ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది.

నా పాత్ర విషయానికొస్తే..నేనో క్రేజీ ఫెలోని. అవతలివారికి నా వల్ల ఎప్పుడూ ప్రమాదమే. సాఫ్ట్‌ గా కనిపించి..నైసుగా కోసేస్తా.. విలక్షణ విలనీ చేస్తాను. పైకి కనిపించేట్టు కాకుండా దానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది"" అన్నారు. దర్శకుడి గురించి మాట్లాడుతూ 'విష్ణు..ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. నా పాత్రను తనే స్వయంగా నటించి మరీ చూపించారు. దాంతో నా పని చాలా సులువైంది. నేను జాకీ ష్రాప్‌తో ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను. పవన్‌తో, అంజలి లావాణియాతో కీలక సన్నివేశాల్లో కనిపిస్తా. ఓ భారీ యాక్షన్‌ సీన్‌లోనూ నటించాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X