‘పంజా’ ఓపెనింగ్ సాంగ్ 'అదుర్స్'..ఖచ్చితంగా మ్యూజిక్ రాక్ : రామ్ చరణ్..!

By Sindhu

ఆరెంజ్" సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంద్ దర్శకత్వంలో రామ్ చరణ్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'రచ్చ". హైదరాబాద్ లో రీసెంట్ గా రామ్ చరణ్ -తమన్నా లపై ఓ సాంగ్ ని షూట్ చేసి విషయం తెలిసిందే. ఆ తర్వాత షెడ్యూల్ గత కొన్ని రోజుల నుంచీ చైనాలో రామ్ చరణ్ తేజా నటిస్తున్న 'రచ్చ' సినిమా షూటింగు జరుగుతున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా పాటల చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది. మెగా పవర్ స్టార్ ఇటీవలే చిరంజీవి గ్యాంగ్ లీడర్ లోని వాన పాట రీమిక్స్ లో తమన్నాతో కలిసి స్టెప్పులేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అందమైన సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో తనయుడు చెర్రీ ఇరగదీశాడని చిరంజీవి ఆనందంతో మురిసిపోతున్నాడు. ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు చేయని లొకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ చేసేందుకు దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశాడు. చరణ్ ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్ మీద పడ్డాడు. చైనాలోని ఏన్జీ నగరం సమీపంలోని ఫారెస్ట్ లో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. ఏన్జీ వెదురు అడవులకు ప్రసిద్ది. ఏపుగా ఎదిగిన అందమైన వెదురు చెట్లు కనువిందు చేస్తాయి. ఈ దట్టమైన వెదురు అడవుల్లో శరీరం గడ్డకట్టే చలిలో యూనిట్ అంతా ఎంతో కష్టపడి షూటింగ్ చేస్తున్నారని చరణ్ చెబుతున్నాడు.

ఇదిలా ఉంచితే, నిన్న విడుదలైన 'పంజా' పాటలు చాలా బాగున్నాయంటూ మెగా పవర్ స్టార్ చరణ్ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్ సాంగ్ 'అదుర్స్' అంటున్నాడు. పవన్ కథానాయకుడిగా విష్ణువర్థన్ దర్శకత్వంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, వెంకట్ దేవినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం 'పంజా". యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటల విడుదల శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన విషయం విధితమే.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X