పవన్ ఫ్యాన్స్ కి సంక్రాంతి పండగ సంబరాలు ఒక నెల ముందుగానే...!
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా విష్ణువర్ధన్ డైరెక్షన్లో రూపొందిన 'పంజా' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకొన్న విషయం తెలిసిందే. కాగా చిత్రాన్ని సెన్సార్ సభ్యులు బాగానే ఎంజాయ్ చేయడమే కాకుండా సినిమా గురించి పాజిటివ్ టాక్ ఇచ్చారనే సమాచారం. సినిమా చాలా బాగుందని, పక్కా మాస్ ఫిల్మ్. చాలా స్టైలిష్ గా ఉంది. ఎంటర్ టైన్మెంట్, రివేంజ్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం ఈ సినిమాకి హైలెట్. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి నేటివిటీ డ్రాబ్యాక్ అయ్యే అవకాశముందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమాకి మంచి రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. ఈ నెల 9న విడుదలవుతున్న ఈచిత్రంతో పవన్ అభిమానులు సంక్రాంతి పండుగ సంబరాలు ఓ నెల ముందుగానే జరుపుకోనున్నారు.
సెన్సార్ పూర్తవడంతో చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టు, ఈ నెల 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే, సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూతో కూడిన సినిమా మేకింగ్ కు సంబంధించిన వూటేజ్ ని టీవీ చానల్స్ కు ఇచ్చారు. దీంతో తెలుగు చానెల్స్ అన్నీ వీటిని ప్రమోట్ చేస్తూ ఊదరకొట్టేస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులు సినిమా చూస్తే తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు అంటున్నారు. ఇందులో అబ్బూరి రవి మాటలు పవన్ నోట విని అభిమానులు విజిల్స్ వేస్తారని రిపోర్ట్ ను బట్టి 'పంజా" రికార్డులు సృష్టించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.


Click it and Unblock the Notifications











