కేక పుట్టిస్తున్న పవన్ కొత్త స్టిల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పంజా". ఇందులో పవన్ డబల్ రోల్ చేస్తున్నారు, ఒకటే మో డాన్ పాత్ర, మరొకటేమో విలేజ్ కుర్రాడి పాత్ర. ఇందుకు తగిన విధంగానే పంజా స్టిల్స్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు విభిన్న గెటప్ తో పంజా స్టిల్స్ విడుదలయ్యాయి. తాజాగా పవన్ డాన్‌గా ఓ సింహాసనంలో కూర్చుని ఉండే ఫోటో విడుదలైంది. ఈ ఫోటోను చూస్తుంటే పవన్ కళ్యాణ్‌కు డాన్ పాత్ర పర్ ఫెక్ట్‌గా సెట్టయింది అని సంబర పడుతున్నారు అభిమానులు.
పవన్ సరసన సారాజేన్ డియాస్, అంజలీ లవానియా హీరోయిన్స్ గా చేస్తున్నారు. క్రిష్, త్రీ ఇడియట్స్, లాంటి భారీ చిత్రాలకు స్టంట్స్ సమకూర్చిన శ్యామ్ కౌశల్ స్టంట్ మాస్టర్ కావడంతో భారీ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉంటాయంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, నిర్మాతలు : నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











