»   » పవన్ పార్టీ ప్రెస్ మీట్ డిటేల్స్ (అఫీషియల్)

పవన్ పార్టీ ప్రెస్ మీట్ డిటేల్స్ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజకీయ ప్రవేశానికి సంభందించిన మొదటి ప్రెస్ మీట్ ని పవన్ కళ్యాణ్ 14 వ తేదీ సాయింత్రం మాదాపూర్ లోని హై టెక్స్ లో నిర్వహించనున్నారు. ఆయన 6 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రసంగిస్తారు. అదే సమయంలో ఆయన తన టీమ్ ని, ఎలక్షన్సల్ లో నిలబడబోయే వారిని పరిచయం చేస్తారు. అలాగే ఆ క్యాండెట్స్ లో మాజీ బ్యూరో కాట్స్ , సామాజిక స్పృహ ఉన్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.

పవన్‌ కల్యాణ్‌ పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వూహాగానాలకు బలం చేకూరుస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్‌ పేరిట ఒక హాలు నమోదైనట్లు తెలుస్తోంది. హైటెక్స్‌ వేదికగా ఈ నెల 14న సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ తాను స్థాపించబోయే కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు హైటెక్స్‌కు రావల్సిందిగా ఆహ్వానాలు అందాయని సమాచారం. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే మీడియా సమావేశంలో సుమారు గంటసేపు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారని, అనంతరం తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పవన్‌ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నట్లు సమాచారం.

పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టబోతున్నారనే వార్తపై చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ స్పందించారు. రాజకీయాలపై తనకు అవగాహన లేదంటూనే పార్టీ స్థాపన అనేది బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత విషయమని, ఆపడానికి ఎవరికి హక్కు లేదని పేర్కొన్నారు.

అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్‌సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.

మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.

English summary
Pawan Kalyan is going to hold his first press event regarding to political entry will be held on the evening of 14 March at HITEX, Madhapur. He will speak for an hour between 6 pm to 7 pm. He will also introduce his core team which consists of several famous names who never contested in elections so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu