»   »  పెండింగులో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్స్ ఎన్ని?

పెండింగులో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్స్ ఎన్ని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దాసరి నారాయణరావు సొంత బేనర్లో సినిమా ఓ సినిమా నిర్మిస్తున్న అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫీషియల్‌గా ఖరారై, ఇప్పటికీ మొదలు కాకుండా పెండింగులో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుల సంఖ్య నాలుగుకు చేరింది. ఏయే సినిమాలు పెండింగులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం....

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కాంబినేషన్లో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు ఊసే లేదు. ఈ సినిమా పెండింగులో ఉందా? రద్దయిందా? అనేది ఇప్పటికీ సరైన సమాచారం లేదు. అసలు ఈ సినిమా విషయాన్ని అందరూ ఎప్పుడో మరిచి పోయారు.

గోపాల గోపాల చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ పార్ధసాని(డాలి) ఆ చిత్రం ఆడియో వేడుక సందర్బంగా పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేస్తానని, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని, కథను సిద్దం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందనేది డాలీ మీద ఆధార పడి ఉంది.

Pawan Kalyan's pending projects details

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తన సొంత బేనర్ తారకప్రభు ఫిలింస్ బేనర్లో 37వ సినిమా పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. దాంతో ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ దర్శకుడు పూరి జగన్నాథ్ అయ్యిండే అవకాసం ఉందని అంటున్నారు. రీసెంట్ గా ..పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రం చూసి ముగ్థుడైన దాసరి... తనవారసుడి లేని లోటును పూరీ భర్తీచేశాడని కూడా ప్రకటించారు. ఈ ఉదంతాలు చూస్తుంటే దాసరి, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్‌ చిత్రం తీయనున్నారనీ, దానికి పూరీ దర్శకత్వం వహించనున్నారని కూడా ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్-2' త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహించాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో కెఎస్ రవీంద్ర చేతికి వెళ్లింది. పవన్ స్నేహితుడు శరత్ మరాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

English summary
Check out power star Pawan Kalyan's pending projects details.
Please Wait while comments are loading...