»   » షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)

షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ' మూవీ ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడని తొలుత అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కు వెల్ కం చెబుతూ కొన్ని పోస్టర్లు కూడా వెలిసాయి.

అయితే ఏమైందో తెలియదు కానీ చివరి నిమిషయంలో పవన్ కళ్యాణ్ రావడం లేదని ప్రకటించారు. అయితే ఆయన ఎందుకు రావడం లేదని తెలుసుకునే ప్రయత్నం చేసిన అభిమానులు, ఇటు మీడియా వారికి అక్కడ కొన్ని షాకింగ్ సంఘటనలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ కి వెల్ కం చెబుతూ తయీరు చేసిన పోస్టర్లు తొలగించబడి పక్కన పడేసి ఉన్నాయి.

 Pawan Kalyan's Poster removed

పవన్ కళ్యాణ్‌కు వెల్ కం చెబుతూ పోస్టర్లు ముద్దించడాన్ని బట్టి తొలుత.. ఆయన ఆడియో వేడుకకు వచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాతనే తన మనసు మార్చుకుని గైర్హాజరయ్యారని స్పష్టమవుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో?

కాగా బ్రూస్ లీ ఆడియో వేడుక కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులు, రాంచరణ్ సతీమణి ఉపాసన, అరుణ్ విజయ్, గోపీమోహన్, కృతికర్భందా, కోన వెంకట్, ఎన్వీ ప్రసాద్, ముఖేశ్‌రుషి, నదియా, రకుల్‌ప్రీత్ సింగ్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ, సాయి ధరమ్‌తేజ్, టిస్కాచోప్రా, సంపత్‌రాజ్, రామజోగయ్యశాస్త్రి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

English summary
When Mega fans and media watched a poster of Pawan Kalyan was being removed at the audio launch auditorium of “Bruce Lee”,everybody got shocked.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu