ఆరోజే మీడియా ముందుకు పవన్ కళ్యాణ్, మాటీవీ లైవ్?

By Bojja Kumar

 Pawan Kalyan’s press meet not cancelled but Postponed
హైదరాబాద్: రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే చర్చ. రాజకీయాలపై తన అభిప్రాయాలను, కొత్త పార్టీ పెట్టే విషయాలను స్వయంగా వెల్లడిస్తానని ఆయన కార్యలయం నుండి ప్రకటన రావడంతో మీడియా వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ఎన్నికల కమీషన్ నిన్న ఎన్నికల తేదీలను ప్రకటించడం, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో.....పవన్ ఇప్పట్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని, ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మీడియా సమావేవం రద్దు కాలేదని, కేవలం వాయిదా మాత్రమే పడింది, ఆదివారం(మార్చి 9) ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు టీవీ రిపోర్ట్స్ ద్వారా తెలస్తోంది. మాటీవీలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు టాక్.

మరి పవన్ కళ్యాణ్ ఈ మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేసే అవకాశం మాత్రం లేదు. మరి ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? లేక ఇందకు పూర్తిగా భిన్నమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? అనేది చర్చనీయాంశం అయింది.

మరో వైపు పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కేంద్ర మంత్రి పదవిలో ఉన్న నేపథ్యంలో......అన్నయ్య గురించి పవన్ కళ్యాణ్ ఏమాట్లాడబోతున్నారు? అన్నయ్య అభిష్టానికి విరుద్దంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతారా? మరేమైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఆదివారం తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X