బండ్ల గణేష్ భారీ స్కెచ్చే వేశాడు.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే!

సినిమాల్లో పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్.. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో తన అన్నయ్య లాగే రాజకీయ బాట పట్టారు. జనసేన అంటూ జనం ముందుకెళ్లి సమాజంలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడానికి తనకు అవకాశమివ్వండంటూ మొత్తుకున్నా జనం చూపు పవన్ పై పడలేదు. వెరసి ఎన్నికల ఫలితాలు చూస్తే జనసేన పార్టీ అట్టర్ ప్లాప్. దీంతో.. ఊహించని విధంగా ఓటమి చవిచూసిన పవన్‌కి ఇక రాజకీయ భవిష్యత్ లేనట్లే! అన్నయ్య లాగే ఆయన కూడా తిరిగి ముఖంపై మేకప్ వేసుకోక తప్పదు అనే టాక్ బాలంగా వినిపిస్తోంది జనాల్లో. ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ అంటూ ఓ ఆసక్తికర వార్త జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ విశేషాలు చూద్దామా..

 ఆర్థిక అవసరాల నిమిత్తం పవన్ కళ్యాణ్

ఆర్థిక అవసరాల నిమిత్తం పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఓటమి తర్వాత మీడియా ముందుకొచ్చి తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజల తీర్పును గౌరవించి వారికి మద్దతుగా నిలుస్తానంటూ పవన్ చెప్పినా కూడా ఆ మాటలు జనం మెదళ్లలోకి ఎక్కలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరఫున పెట్టిన ఖర్చుతో పవన్‌కి ఆర్ధికంగా లోటు జరిగిందని, కాబట్టి ఆర్థిక అవసరాల నిమిత్తం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

 పవన్‌తో బండ్ల గణేష్ చర్చలు

పవన్‌తో బండ్ల గణేష్ చర్చలు

పవన్, బండ్ల గణేష్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కూడా రాజకీయాలంటూ కండువాలు కప్పుకొని నట్టేట మునిగే స్థితికి వచ్చేశారు. దీంతో బండ్ల గణేష్ ఓ ఆలోచనకు వచ్చారట. పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలని, త ద్వారా వచ్చే లాభాలతో ఇద్దరం బయట పడాలని ఆయన స్కెచ్ వేశారట. ఈ మేరకు పవన్‌తో గత మూడు రోజులుగా బండ్ల గణేష్ చర్చలు సాగిస్తున్నాడని సమాచారం.

ఏకంగా 40 కోట్ల ఆఫర్

ఏకంగా 40 కోట్ల ఆఫర్

పవన్ ని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా తాను నిర్మించబోయే సినిమాలో నటిస్తే ఏకంగా 40 కోట్ల రెమ్మ్యూనరేషన్ గా ఇస్తానని బండ్ల గణేష్ చెప్పారట. మరోవైపు వీలైనంత తక్కువ టైంలో మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేయమని బోయపాటికి శ్రీనుకు కూడా చెప్పాడట బండ్ల గణేష్. అంటే ఈ ప్రాజెక్టు బాధ్యతను బోయపాటి చేతిలో పెడదామని బండ్ల గణేష్ ప్లాన్ అన్నమాట.

బోయపాటి కష్టాలు కూడా తీరేలా

బోయపాటి కష్టాలు కూడా తీరేలా

ఇటీవలే వినయ విధేయ రామ సినిమాతో భారీగా డామేజ్ అయిపోయిన బోయపాటి ఇమేజ్ పవన్ రీ ఎంట్రీ సినిమా కాబట్టి ఒక్కసారిగా పెరిగిపోతుందని బండ్ల గణేష్ సూచించారట. పైగా ఆయనకు 10 కోట్ల రూపాయల రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేయడంతో బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.

మొత్తంగా 100 కోట్లు

మొత్తంగా 100 కోట్లు

పవన్ రెమ్మ్యూనరేషన్ 40 కోట్లు అదేవిధంగా బోయపాటి రెమ్మ్యూనరేషన్ 10 కోట్లు.. ఇక ఇతర సినిమా నిర్మాణ పనులు 50 కోట్లు. ఇలా మొత్తంగా 100 కోట్లు పవన్ రీ ఎంట్రీ కోసం బండ్ల గణేష్ వెచ్చించబోతున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో యమ హాట్ చర్చలకు దారి తీసింది.

ఇంతకీ సాధ్యమేనా..?

ఇంతకీ సాధ్యమేనా..?

పవన్, బండ్ల గణేష్ మధ్యలో ఎంత స్నేహమున్నప్పటికీ.. ఆయన చెప్పారని ఇప్పటికిప్పుడు పవన్ రీ ఎంట్రీ విషయంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ అలా తీసుకున్నా అది పెద్ద తప్పు అవుతుంది. పైగా ఓ మెగా హీరోకి వినయ విధేయ రామ లాంటి అట్టర్ ప్లాప్ ఇచ్చిన బోయపాటి స్క్రిప్ట్ లో చేస్తే జనాలు వ్యతిరేకించే అవకాశముంది, కాబట్టి ఎన్ని రూమర్లు వచ్చినా పవన్ రీ ఎంట్రీ అనేది ఇప్పట్లో సాద్యపడే విషయం కానేకాదు! ఏమంటారు?.బండ్ల గణేష్ భారీ స్కెచ్.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే!

సినిమాల్లో పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్.. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో తన అన్నయ్య లాగే రాజకీయ బాట పట్టారు. జనసేన అంటూ జనం ముందుకెళ్లి సమాజంలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడానికి తనకు అవకాశమివ్వండంటూ మొత్తుకున్నా జనం చూపు పవన్ పై పడలేదు. వెరసి ఎన్నికల ఫలితాలు చూస్తే జనసేన పార్టీ అట్టర్ ప్లాప్. దీంతో.. ఊహించని విధంగా ఓటమి చవిచూసిన పవన్‌కి ఇక రాజకీయ భవిష్యత్ లేనట్లే! అన్నయ్య లాగే ఆయన కూడా తిరిగి ముఖంపై మేకప్ వేసుకోక తప్పదు అనే టాక్ బాలంగా వినిపిస్తోంది జనాల్లో. ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ అంటూ ఓ ఆసక్తికర వార్త జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ విశేషాలు చూద్దామా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X