జానకిరామ్ మృతి: పవన్ కళ్యాణ్,మిగతా సెలబ్రెటీల స్పందన
హైదరాబాద్ : నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజాగూడలోని వారి వ్యవసాయక్షేత్రంలో పూర్తయ్యాయి. జానకిరాం కుమారుడు చిన్నారి తారకరామారావు తండ్రిచితికి నిప్పంటించాడు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘‘హరికృష్ఱగారికి, కళ్యాణ్‌రామ్‌గారికి, ఎన్టీఆర్‌గారికి, నందమూరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని తెలిపారు పవన్‌కల్యాణ్. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్ధించారు.
నిర్మాత నందమూరి జానకిరామ్ మృతితో హరికృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. నందమూరి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కథానాయకులు, దర్శకులు, నిర్మాతలే కాదు.. యావత్ తెలుగు చిత్రసీమ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ విషాదం నుంచి హరికృష్ణ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకొంటూ జానకిరామ్‌కు నివాళులర్పించింది.
మోహన్ బాబు మాట్లాడుతూ..‘‘జానకిరామ్ తన తాతగారి పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించినప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో వేరే నిర్మాత సంతకం తీసుకురమ్మన్న సందర్భంలో నా దగ్గరికి వచ్చి మొదటి సంతకం తీసుకున్నాడు. వారి ఫ్యామిలీతో నాకు అంతటి అనుబంధం ఉంది. ఈరోజు జానకి మన మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైన విషయమే. హరికృష్ణ కుటుంబం గుండెరాయి చేసుకుని ధైర్యంగా ఉండాలి'' అని చెప్పారు.
మిగతా సిని సెలబ్రెటీలు స్పందన...వారి మాటల్లోనే..

బోయపాటి శ్రీను స్పందిస్తూ..
‘‘అతి చిన్న వయసులో జానకిరామ్ మరణించడం బాధాకరం. ఇది అందరిలో హృదయాలను కలచివేసిన దుర్ఘటన. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా అందరి హృదయాల్లో ఎప్పుడూ ఉంటారు'' అని తెలిపారు బోయపాటి శ్రీను.

మోహన్‌బాబు స్పందిస్తూ..
''మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి హరికృష్ణ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. జానకిరామ్ నాకు బాగా ఆప్తుడు. తను మన మధ్య లేడన్న విషయం జీర్ణించుకోలేనిది. హరికృష్ణ గుండెను రాయి చేసుకోవాలి. హరికృష్ణ కుటుంబానికీ, కల్యాణ్‌రామ్‌కీ, ఎన్టీఆర్‌కీ ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి''

సాయి కొర్రపాటి స్పందిస్తూ...
''నందమూరి జానకిరామ్ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దురదృష్టకరమైన సంఘటన నుంచి హరికృష్ణ కుటుంబం త్వరగా కోలుకోవాలి..''

కైకాల సత్యనారాయణ స్పందిస్తూ...
''నందమూరి కుటుంబం అంటే నా కుటుంబ సభ్యుల్లాంటివారు. జానకిరామ్ మరణవార్త నన్ను కలచి వేసింది. వారి కుటుంబానికి నా సానుభూతి''

బాబూ మోహన్ స్పందిస్తూ...
''పుత్రశోకం చవిచూసినవాడిని. ఇది ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కోట శ్రీనివాసరావు కొడుకును కోల్పోయినప్పుడు ఆయన బాధను చూశాను. ఇప్పుడు హరికృష్ణకు పుత్రశోకం కలగడం బాధాకరం''

ప్రసాద్ వి.పొట్లూరి స్పందిస్తూ...
''అందరి హృదయాలనూ విషాదంలో ముంచెత్తిన సంఘటన ఇది. మంచి వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరమవ్వడం జీర్ణించుకోలేకపోతున్నాం''

చిరంజీవి స్పందిస్తూ...
''సీటు బెల్టు పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలను ఎంతోకొంత తప్పించుకునే అవకాశం ఉంది. కొడుకును కోల్పోయిన హరికృష్ణ బాధ తీర్చలేనిది. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు''
మంచు లక్ష్మి...
‘‘జానకీరామ్‌గారి మరణవార్త వినగానే గుండె పగిలినంత పనైంది'' అని ట్వీట్ చేశారు మంచు లక్ష్మి.

రామ్ చరణ్ స్పందిస్తూ...
హరికృష్ణ కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని రామ్‌చరణ్ ఆకాంక్షించారు.

కైకాల సత్యనారాయణ స్పందిస్తూ...
‘‘నందమూరి జానకీరామ్ మరణవార్త వినగానే షాక్‌కి గురై ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. నా కాళ్ళకు గాయలవ్వడం వల్ల ఇంటి నుండి కదిలే పరిస్థితి లేదు. అందుకే హరికృష్ణను కలిసి పరామర్శించలేకపోతున్నాను. ఈ బాధను తట్టుకొనే శక్తిని దేవుడు హరికృష్ఱ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి'' అన్నారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ.

బాలకృష్ణ..
తనయుడు జానకిరామ్ దుర్మరణంతో కుంగిపోయిన హరికృష్ణను ఆయన సోదరుడు బాలకృష్ణ ఓదార్చారు. జానకిరామ్ పార్దీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.


Click it and Unblock the Notifications











