'సర్దార్ గబ్బర్‌సింగ్' ఫస్ట్ లుక్ : సెలబ్రెటీల స్పందన
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ మళ్లీ వస్తూ...తన తిక్కేంటో.. లెక్కేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. బాబీ దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 'సర్దార్ గబ్బర్‌సింగ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ ఫస్ట్ లుక్ ని చూసిన పవన్ అభిమానులే కాక ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు ఓ రేంజిలో స్పందించారు. ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఏ సెలబ్రెటీ ఏమన్నారు...అనేది క్రింద స్లైడ్ షోలో చూడండి.
నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.
స్లైడ్ షోలో... సెలబ్రెటీలు ఏమన్నారో చూద్దాం...
నితిన్
పవన్ కళ్యాణ్ ...వీరాభిమాని అయిన నితిన్ ఇలా స్పందించారు
వరుణ్ తేజ
నాగబాబు కుమారుడు తన బాబాయ్ ...ఫస్ట్ లుక్ చూసి ఇలా స్పందిచారు
కోన వెంకట్
పవన్ కి మిత్రుడైన కోన వెంకట్ ఇలా స్పందించారు.
వెన్నెల కిషోర్
పవన్ కి వీరాభిమాని అయిన వెన్నెల కిషోర్ ఇలా స్పందించారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని
పండుగచేస్కో దర్శకుడు గోపిచంద్ మలినేని ఇలా స్పందించారు

ఫస్ట్ లుక్ ని మొదటే
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మొదటి పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసి వదిలారు

అన్ని జాగ్రత్తలూ
ఇక 'గబ్బర్ సింగ్ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు.

విలన్ ని..
'గబ్బర్ సింగ్ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్ కేల్కర్. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ఎంతోమందిని
ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్ కేల్కర్‌ని ఎంచుకొన్నారట.

తెలుగు నేర్చుకున్నారు
ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్ నటన పట్ల పవన్ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

మహారాష్ట్రలో..
ఇటీవల మహారాష్ట్రలో తొలి షెడ్యూలు పూర్తయింది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది

తెర వెనుక
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, కెమెరా: జయనన్ విన్సెంట్.


Click it and Unblock the Notifications











