పవన్ కళ్యాణ్ చాలా కష్టంగా ఫీలయ్యే పనుల్లో ఇదీ ఒకటి!
హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇపుడు సినిమా మొత్తంలో చాలా కష్టమైన స్టేజీకి చేరుకున్నారు. అది మరో కాదు... సినిమాలో పాటల చిత్రీకరణ. ఎందుకోగానీ పవన్ కళ్యాణ్ పాటల చిత్రీకరణ పార్టును చాలా కష్టంగా ఫీలవుతారు. ఇందులో డాన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. తనకు పెద్దగా డాన్స్ చేయడం రాదని పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు చివరి దశకు చేరుకోవడంతో....ప్రస్తుతం పాటల చిత్రీకరణ మొదలు పెట్టారు. మరి కష్టమైనా తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల అభిరుచి మేరకు సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తున్నారు. తన బాడీ లాంగ్వేజికి తగిన విధంగా డాన్స్ కంపోజ్ చేయించుకుంటున్నారు.
Also Read: వాటే క్రేజ్ : పవన్ తో సెల్ఫీ కోసం పోటాపోటీ (ఫొటోలు)
కొన్ని పాటలు ఇక్కడే చిత్రీకరించనున్నారు. రెండు పాటలు మాత్రం యూరఫ్ లో ప్లాన్ చేస్తున్నారు. మార్చి చివరి వారంలో యూరఫ్ లో సాంగ్ చిత్రీకరణ జరుగబోతోంది. యూరఫ్ షెడ్యూలే సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ కాబోతోంది. ఈ లోగా బ్యాలెన్స్ సాంగ్స్, మరికొన్ని మిగిలిపోయిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సినిమాలో ఎంటర్టెన్మెంట్ పార్టు ఓ రేంజిలో ఉంటుందని... అలీ, బ్రహ్మాజీ తదితరులతో కలిసి పవన్ కళ్యాణ్ పండించే కామెడీ సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. మరో వైపు ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉన్నాయట. మార్చి రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు 90 శాతం పూర్తయింది. ఆల్రెడీ లక్ష్మీరాయ్ తో ఐటం సాంగ్, కాజల్ తో సాంగు కూడా పూర్తయింది. పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూసింగ్ సాంగును వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతోంది.


Click it and Unblock the Notifications











