పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: స్వాంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్' ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీ ద్వారా ఈ పోస్టర్ రిలీజ్ చేయగా, దర్శకుడు బాబీ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఈ పోస్టును రీట్వీట్ చేసారు.
గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడి అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

ఫస్ట్ లుక్
పవన్ కళ్యాణ్ సినిమాకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

లుక్ సూపర్
పవన్ కళ్యాణ్ లుక్ సూపర్ గా ఉందని అభిమానులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ నిర్మాణ భాగస్వామ్యం
ఈ మూవీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సొంత బేనర్ పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ కూడా భాగస్వామ్యం కానుంది.

దర్శకుడితో..
సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ)తో పవన్ కళ్యాణ్.

దర్శక నిర్మాతలతో
దర్శక నిర్మాతలు శరత్ మరార్, బాబీలతో కలిసి పవన్ కళ్యాణ్.


Click it and Unblock the Notifications











