»   » పవన్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' : ఈసారి బండెక్కాడు

పవన్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' : ఈసారి బండెక్కాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్ లుక్ ఇలా రిలీజైందో లేదో అప్పుడే ఫ్యాన్సే లో హంగామా ప్రారంభమైపోయింది. వారు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ ఫేస్ బుక్, ట్విట్టర్ టైమ్ లైన్లలపై పెట్టడమే కాక ఇప్పుడు తమ బైక్ లుపై ఇదిగో ఇలా ఎక్కిస్తున్నారు. ఫ్యాన్స్ లో ఆనందం మూమూలుగా లేదు. ఈ ఫస్ట్ లుక్ కు వీర రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.

గబ్బర్‌ సింగ్‌ మళ్లీ వస్తూ...తన తిక్కేంటో.. లెక్కేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. బాబీ దర్శకుడు. శరత్‌ మరార్‌ నిర్మాత. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అబిమానుల నుంచి ఈ ఫస్ట్ లుక్ కి ప్రశంసలు అందుతున్నాయి.

 Pawan Kalyan's Sardar Gabbar Singh poster @ Fan Bike


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విషయానికి వస్తే..

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

English summary
Apparently, to the joy of Power Star Pawan Kalyan's fans, Sardaar Gabbar Singh's shooting is happening at a brisk pace without any long breaks and the film is gearing up to hit screens on 14 January during the Pongal race.
Please Wait while comments are loading...