సర్దార్: పవన్ కళ్యాణ్ వచ్చాడు.... మొదలెట్టాడు!

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్-2'(ఇపుడు టైటిల్ ‘సర్దార్' అని మర్చారు) సినిమా చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా తొలిషెడ్యూల్ ప్రారంభం అయినా పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు.

సెకండ్ షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొంటారని చెప్పినా, అదీ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నేడు(జులై 29) హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యారు.

Pawan Kalyan's Sardar second schedule kick starts in Hyderabad

ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X