‘శిఖండి’ అంటూ...పవన్‌పై సెటైర్లు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రముఖ ఆంగ్లపత్రిక 'ది హాన్స్ ఇండియా' వెబ్ సైట్లో వచ్చిన కథనం ప్రకారం......ఎవరో కొందరు పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'శిఖండి' అనే సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వదిలినట్లు తెలుస్తోంది.
ఆ మార్ఫింగ్ చేసిన పోస్టర్‌పై ఇలా రాసి ఉంది.... ''నారా చంద్ర మోడీ సమర్పణలో పాగల్ కళ్యాణ్ నటించు 'శిఖండి' పూజకు పనికి రాని పువ్వు'' అని అందులో రాసి ఉంది. మీడియా పార్టనర్స్ అంటూ కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ లోగోలు కూడా అందులో ఉన్నాయి. ఆ పోస్టర్ అసభ్యంగా ఉండటంతో దాన్ని చూపించలేక పోతున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్టర్ చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పేరుతో సోషల్ మీడియాలో కొందరు డబ్బుల వసూళ్లు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేసారు. 'జనసేన' పేరును కొందరు సోషల్‌మీడియాలో వాడుకొని నిధులు వసూలుచేస్తున్నారని వీరిపై కఠినచర్యలు తీసుకుంటామని పవన్ తరుపున జనసేన తెలిపింది. జనసేన పార్టీ పేరిట, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications