పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌కు నిప్పు
పవన్ కళ్యాణ్ హీరోగా హారిస్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'దబాంగ్' రిమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని పొల్లచ్చిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండు రోజుల క్రితమే సినిమా యూనిట్ హైదరాబాద్ చేరుకుంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం పొల్లాచ్చిలో 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ నిప్పంటుకుని తగలబడినట్లు సమాచారం. రూ. 60 లక్షలు ఖర్చుపెట్టి వేసిన పోలీస్ స్టేషన్ తదితర సెట్లు అగ్ని ఆహుతైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 28 వ తేదీన సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











