పవన్ సోదరి సమక్షంలో సెలబ్రేషన్స్, సేవ(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పుట్టినరోజు సంబరాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సోదరి మాధవి కూడా పాల్గొన్నారు.

సుభిక్ష స్వచ్ఛందతో కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నపిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్యం గురించి ఈ సంస్థ పని చేస్తోంది. ఈ సందర్భంగా పవన్ సోదరి మాధవి బడిపిల్లలకు దుస్తులు పంపిణీ చేసారు. అంతకు ముందు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసారు.

కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు పవన్ మూడవ సంతానం. ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు పవన్ కళ్యాణ్‌గా మారింది. సెప్టెంబరు 2, 1973న జన్మించిన పవన్‌కు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. మెగాస్టార్ చిరంజీవి పవన్ పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్‌ని 28 జనవరి 2009 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురుసోవా పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X