సోషల్ మీడియాని ఊపేస్తున్న అకీరా నందన్ కొత్త ఫోటోలు.. జూ. పవర్ స్టార్ అంటూ!

Recommended Video

Akhira's Photos Goes Viral In Social Media | Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరమయ్యారు. రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ మానియాని అభిమానులు సినిమాల్లో మిస్ అవుతున్నారనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా టీనేజ్ లోనే సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు. పవన్ మాజీ భార్య దేశాయ్ తరచుగా అకిరా ఫోటోలని, విశేషాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అఖిల్ కొత్త పిక్ ఏది బయటకు వచ్చినా ఇంటర్ నెట్ లో హల్ చల్ ఖాయం. తాజాగా అకిరా లేటెస్ట్ ఫోటోలు కొన్ని పవన్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

జూ. పవర్ స్టార్ అంటూ

జూ. పవర్ స్టార్ అంటూ

అకిరాని ఇప్పటికే పవన్ అభిమానులు జూ. పవర్ స్టార్ అంటూ పిలవడం ప్రారంభించేస్తున్నారు. తనకు, పవన్ కళ్యాణ్ గారికి అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ఇష్టం లేదని రేణు దేశాయ్ ఇటీవల తేల్చి చెప్పేసింది. అకిరా తన సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని. జూ. పవర్ స్టార్ అని పిలవద్దని అభిమానులని కోరింది. కానీ అది జరిగే పనిలా కనిపించడం లేదు. అకీరాలో పవన్ ని చూడడం ఫ్యాన్స్ ప్రారంభించేశారు.

లేటెస్ట్ ఫోటోలు

లేటెస్ట్ ఫోటోలు

అఖీరా లేటెస్ట్ ఫోటోలు చాలా బావున్నాయి. అకీరానందన్ క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. హెడ్ సెట్ పెట్టుకుని ఉన్న అకిరా పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరో ఫొటోలో అకిరా తన తల్లి రేణు దేశాయ్ తో ఉన్నాడు. తల్లికంటే జానెడు ఎత్తు ఎక్కువగానే పెరిగాడు. తల్లికొడుకులు ప్రేమగా దిగిన ఈ పిక్ కూడా కట్టుకుంటోంది. మరికందరు అభిమానులైతే అకిరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధం అయిపోతున్నాడంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.

 అప్పుడప్పుడు తండ్రి వద్దకు

అప్పుడప్పుడు తండ్రి వద్దకు

అకిరా పూణేలో తన తల్లి రేణు దేశాయ్ వద్దే ఉంటున్న సంగతి తెలిసిందే. తరచుగా ఏదైనా సందర్భంలోనో, లేక వెకేషన్ లోనే తండ్రి పవన్ వద్దకు వస్తుంటాడు. ఆ మధ్యన అకిరా పవన్ తో కలసి విజయవాడలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మూవీ స్టిల్స్ తో అకిరాని పోల్చుతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఎంట్రీ గురించి

ఎంట్రీ గురించి

అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి రేణు దేశాయ్ కు గతంలోనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అకిరా ఇంకా చిన్నపిల్లవాడని, ప్రస్తుతం అతడి దృష్టంతా చదువుపైనే అని రేణు దేశాయ్ తెలిపింది. సినిమాల గురించి మాత్రం సమాధానం దాటవేసింది. మొత్తంగా అకిరా ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ దర్శనం ఇస్తూ మెగా ఫ్యామిలీ నుంచి రాబోయే మరో వారసుడిగా అంచనాలు రేపుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X