twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జానీ' సినిమాలో లోపం అక్కడే జరిగింది.. అందుకే.. పవన్ కళ్యాణ్

    |

    సినిమాల్లో ఆయన పవర్ స్టార్.. పైగా మెగా బ్రదర్‌గా అంతేలేని పాపులారిటీ. ఇటీవలే జనం కోసం, జనసేనానిగా రాజకీయ బాట పట్టి పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడానికి తనకు అవకాశమివ్వండంటూ రాజకీయ గడప తొక్కిన పవన్‌ కళ్యాణ్ కి ఆశించిన దక్కనప్పటికీ వెనుదిరిగి చూసేదే లేదంటూ ముందడుగేస్తున్నాడు. కాగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో అప్పట్లో వచ్చిన జానీ సినిమా గురించి ప్రస్తావించిన పవన్.. తన తెలుగు సినిమాల ఆవశ్యకత గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి పోతే..

    హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్

    హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్

    ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర - పరిణామం' పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు పవన్. నిన్న (మంగళవారం) హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఈ పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేదికపై మాట్లాడిన పవన్.. తన జానీ సినిమా పరాజయం గుర్తుచేస్తూ దానికి కారణాలు కూడా చెప్పారు.

    2003లో భారీ అంచనాల నడుమ జానీ

    2003లో భారీ అంచనాల నడుమ జానీ

    2003 సంవత్సరం కల్లా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన 'జానీ' ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది. ఈ సినిమాలో పవన్, రేణు దేశాయ్ జంటగా నటించారు. మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పవన్ నటించారు.

    'జానీ' ఎందుకాడలేదో తెలుసు

    'జానీ' ఎందుకాడలేదో తెలుసు

    తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జానీ సినిమా డిజాస్టర్ గురించి పవన్ ప్రస్తావిస్తూ.. ఈ సినిమా ఎందుకాడలేదో తనకు బాగా తెలుసని పేర్కొన్నాడు. కమర్షియల్ యాంగిల్‌లో సినిమాను తెరకెక్కించాలనే కోణంలో ఆలోచించి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయానని అందుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం చెందిందని పవన్ చెప్పారు.

    మహానటి అవార్డు రావడం పట్ల ఆనందం

    మహానటి అవార్డు రావడం పట్ల ఆనందం

    ఇటీవలే 'మహానటి' సినిమా జాతీయ అవార్డు గెలుచుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు పవన్. మహానటి సావిత్రి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్ధ్యం, పడిన కష్టం ప్రేక్షక లోకానికి తెలిసిందని, సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.. నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయని పవన్ పేర్కొన్నాడు. ఇలాంటి గొప్ప సినిమాలకు జాతీయ అవార్డు రావడం ఆనందం కలిగించిందని పవన్ చెప్పారు.

     తెలుగు సినిమాలపై మమకారం

    తెలుగు సినిమాలపై మమకారం

    తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర - పరిణామం'లో ఆయన సినీ జీవితాల్లోని చాలా విషయాలు ప్రస్తావించారని అన్నారు పవన్. ఇలాంటి పుస్తకాలు ముందు ముందు మరిన్ని రావాలని, తెలుగు సినిమా చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ విషయంలో తన వంతు సహకారం అందిస్తానని పవన్ అన్నారు.

    English summary
    Pawan Kalyan attended a cheif guest for thelakapalli ravi's book inaguration at film chamber. In this programe he says the reason for his jhonny movie disaster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X