For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బింగ్ కి సిద్దపడుతున్న పవన్ కళ్యాణ్

    By Srikanya
    |
    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది కి డబ్బింగ్ మొదలైంది. ప్రస్తుతం పవన్ కంటిన్యూగా మే నెలాఖరు నుంచి డబ్బింగ్ చెప్తారు. ఓ ప్రక్క షూటింగ్ మరో ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమాంతరంగా జరుగుతంది. ప్రస్తుతం ఆర్.ఎఫ్.సిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 1 నుంచి స్పెయిన్ వెళ్లనుంది.

    ఈ చిత్రం టాకీ పార్ట్ దాదాపు చివరి దశకు చేరుకుంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    మరో ప్రక్క సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైనా....సినిమా టైటిల్‌పై మాత్రం దర్శక, నిర్మాతలు ఇంకా సస్పెన్స్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్‌నగర్‌ నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఈ సస్పెన్స్‌ వీడినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న 'అత్తారింటికి దారేది' అనే టైటిలే ఈ చిత్రానికి ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఇటీవల ఈ టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్లో రిజిస్టర్‌ చేయించడమే ఇందుకు నిదర్శనం.

    ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'మా బేనర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటూనే త్రివిక్రమ్ మార్క్‌తో ఎంతో వైవిద్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తాము. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    
 Pawan Kalyan's forthcoming release is in the last leg of production. The film is currently being shot in RFC and the unit will leave to Spain on June 1 to film a couple of songs on Pawan Kalyan and other cast. Meanwhile, the actor will begin to dub for the film in the last week of May while the post-production works will be carried out simultaneously.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X