'కెమెరామేన్ గంగతో..'ఫస్ట్ టీజర్ డేట్ ఖరారు

By Srikanya

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది.

అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు,సాంకేతిక నిపుణులు వివరాలు

బ్యానర్ : యూనివర్సల్ మీడియా
నటీనటులు:పవన్ కళ్యాణ్,తమన్నా,ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: మణిశర్మ
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X