తీన్ మార్ తొలిరోజు నాలుగు వేల షోలతో రికార్డ్ బీట్...
పవన్ కళ్యాణ్, త్రిష జంటగా జయంత్ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మించిన 'తీన్ మార్" చిత్రం రేపు విడుదల కానున్న సందర్బంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 9 కత్తెర్లు ఇచ్చిందని సమాచారం. ఫైనల్ గా యు సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. కాబట్టి కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ విధంగా 'తీన్ మార్" ఉంటుందని ఊహించవచ్చు. కాగా ఈమధ్య పెద్ద హీరోల సినిమాలని రికార్డుల పేరిట ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీనిని పెద్ద గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, సినిమా ఒకవేళ అటు ఇటు అయినా, ఓపెనింగ్స్ రూపంలో కొంత వరకైనా లాగేయడానికి నిర్మాతలు వేసే ప్లాన్ ఇదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నెల 14 న రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' సినిమాని కూడా అలాగే మొత్తం 1150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారట.
హైదరాబాదులో 60 థియేటర్లు కాకుండా, నైజాంలో మరో 200 థియేటర్లలో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే, తొలి రోజు టోటల్ గా 4000 షోలు పడతాయట! ఒక్క హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లోనే ఆ రోజు 30 షోలు వేస్తున్నారు. గతంలో ఇతరులవి ఈ థియేటర్లో 20 షోల రికార్డ్ వుంటే, పవన్ సినిమా మాత్రం 25 షోల రికార్డ్ వుంది. ఇప్పుడా రికార్డుని తనే క్రాస్ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉంచితే, ఈ లెక్కన ఒక్క తొలి రోజే అన్ని షోలకు కలిపి 8 కోట్లు షేర్ వస్తుందట! ఖుషీ ఏప్రిల్ లోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది దృష్టిలో పెట్టుకొనే 'తీన్ మార్"ని కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశాడు గణేష్ బాబు. మరి 'తీన్ మార్"తో పవన్ కళ్యాణ్ మరోసారి రికార్డులు సృష్టిస్తాండంటారా?


Click it and Unblock the Notifications











