పవన్ కళ్యాణ్ బుల్లితెర షో, సత్యమేవ జయతే తరహాలో.. షూటింగ్ ఎప్పుడంటే!
అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సామజిక సమస్యలపై తన స్పందిన తెలియజేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ మీడియా సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ కు ఓ ప్రతిపాదన వచ్చింది. సామజిక సమస్యల్ని హైలైట్ చేసే బుల్లి తెర షోకు హోస్ట్ గా వ్యవహరించాలని కోరారు.
ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన సత్యమేవ జయతే తరహాలో ఈ షో సాగనుందని ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రలో తీవ్రంగా ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ ఈ షో ద్వారా హైలైట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఆసక్తిరేపుతున్న బుల్లితెర కార్యక్రమం సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సామజిక సమస్యలతో కార్యక్రమం నిర్వహిస్తే అది సంచలనమే అవుతుంది.


Click it and Unblock the Notifications











