#UstaadBhagatSingh పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌ లోడింగ్.. పవన్ కల్యాణ్ మూవీ గ్లింప్స్ నిడివి ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 11వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీజర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గబ్బర్ సింగ్‌కు 11 ఏళ్లు:
పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం రికార్డులు తిరగరాసింది.ఇప్పటికీ ఆ సినిమా వైబ్ తెలుగు పరిశ్రమలో కనిపిస్తూనే ఉంటుంది. దాదాపు 11 ఏళ్లు కావొస్తున్నా..ఇప్పుడే రిలీజైందా? అనేంత ఫ్రెష్‌గా ఉంటుంది. పాటలు వైరల్ అయితే.. మాటలు తెరమీద తూటాలుగా పేలాయి. అలాంటి కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందనే విషయం అందర్నీలో ఆసక్తిని పెంచింది.

Pawan Kalyans Ustaad Bhagat Singh Glimps is set fire in Telugu film Industry

మే 11 వ తేదీన సంధ్య 70 ఎంఎంలో :
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సినీ రాజధాని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎంలో గ్లింప్స్‌ను లాంచ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మే 11వ తేదీన ఈ చిత్రం సాయంత్రం 4.59 గంటలకు గింప్ల్స్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను అభిమానుల మధ్య నిర్వహించనున్నారు.

Pawan Kalyans Ustaad Bhagat Singh Glimps is set fire in Telugu film Industry

ట్రెండింగ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్:
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రభావం అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగా పడింది. సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్‌గా మారింది. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్‌ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పండగ వాతావరణం నెలకొన్నది. సినిమా రిలీజ్ రోజుకు మంచి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan Kalyans Ustaad Bhagat Singh Glimps is set fire in Telugu film Industry

11 తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎందుకు?:
గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్‌ డేట్‌ను సెలబ్రేట్ చేసుకొనేందుకు ఉస్తాద్ గబ్బర్ సింగ్ గ్లింప్ల్స్‌ రిలీజ్‌ను ప్లాన్ చేశారు. గబ్బర్ సింగ్ చిత్రం మే 11వ తేదీ 2012లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రికార్డులు తిరగరాసిన ఆ చిత్రం రిలీజై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉస్తాద్ గబ్బర్ సింగ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Pawan Kalyans Ustaad Bhagat Singh Glimps is set fire in Telugu film Industry

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ నిడివి ఎంతంటే? :
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఫ్యాన్స్‌కు కిరాక్ పుట్టించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ గ్లింప్స్ నిడివి 45 సెకండ్లుగా సెట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో హరీష్ శంకర్ మార్క్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లోడ్ చేశారు. అభిమానులకు, సగటు ప్రేక్షకులకు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఒక పండగ మాదిరిగా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X