పవన్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ: రిలీజ్ రోజే లీకైన ‘వకీల్ సాబ్’.. ఆ సైట్‌లో మూవీ డౌన్‌లోడ్ లింక్!

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ నామస్మరణ విపరీతంగా వినిపిస్తోంది. దీనికి కారణం దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడమే. దీని కోసం పది రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేసేశారు. థియేటర్లను సుందరంగా తయారు చేసి తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండుగలా జరుపుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇలాంటి సమయంలో రిలీజ్ రోజే పవన్‌కు షాకిస్తూ 'వకీల్ సాబ్' ఫుల్ మూవీ లీకైపోయింది. ఆ వివరాలు మీకోసం!

నభా నటేష్ లవ్లీ పిక్స్.. సరికొత్త అందాలతో ఇస్మార్ట్ బ్యూటీ

పాలిటిక్స్ నుంచి కోర్టుకు.. పవన్ రీఎంట్రీ

పాలిటిక్స్ నుంచి కోర్టుకు.. పవన్ రీఎంట్రీ

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.

అన్ని చోట్లా అదే టాక్... సరైన కమ్‌బ్యాక్

అన్ని చోట్లా అదే టాక్... సరైన కమ్‌బ్యాక్

'వకీల్ సాబ్' మూవీ నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

పవన్ తర్వాత అతడే.. వాళ్లంతా అదుర్స్

పవన్ తర్వాత అతడే.. వాళ్లంతా అదుర్స్

'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అంతలా అతడు ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ఇక, దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చక్కని ప్రతిభను కనబరిచాడు. హీరోయిన్లు అంజలి, నివేదా, అనన్య పోటీ పడి నటించారు. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగే మెప్పించాడు.

 సక్సెస్ సంబరాలు... పల్లె టూ పట్టణాలు

సక్సెస్ సంబరాలు... పల్లె టూ పట్టణాలు

దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గ్యాప్ ఇచ్చినా పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అయ్యేలా సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన, టాక్ వస్తుండడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అలాగే, పల్లెల నుంచి పట్టణాల వరకూ ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కలెక్షన్ల అంచనా... తెలుగులో రికార్డులు

కలెక్షన్ల అంచనా... తెలుగులో రికార్డులు

ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది 'వకీల్ సాబ్'. అందుకు అనుగుణంగానే దీనికి మంచి స్పందన వచ్చింది. మొదటి రోజుకు సంబంధించిన టికెట్లు ఎప్పుడో బుక్ అయిపోయాయి. దీనికి తోడు స్పెషల్, బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 30 కోట్లు కలెక్షన్లు దాటేసే అవకాశం బాగా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పవన్‌కు కోలుకోలేని దెబ్బ.. మూవీ లీక్

పవన్‌కు కోలుకోలేని దెబ్బ.. మూవీ లీక్

'వకీల్ సాబ్' సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ మూడు రోజులతో పాటు ఉగాది సెలవుల వరకూ కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో సినిమాకు జరిగిన బిజినెస్ ఈ ఐదు రోజుల్లోనే కంప్లీట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి సమయంలో విడుదలై 24 గంటలు కాకముందే పవన్ కల్యాణ్‌కు భారీ షాకిస్తూ 'వకీల్ సాబ్' ఫుల్ మూవీ లీకైపోయింది.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
ఆ సైట్‌లో ‘వకీల్ సాబ్' డౌన్‌లోడ్ లింక్

ఆ సైట్‌లో ‘వకీల్ సాబ్' డౌన్‌లోడ్ లింక్

పైరసీని ప్రోత్సహించే మూవీ రూల్జ్ సహా కొన్ని సైట్లు 'వకీల్ సాబ్' ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్‌ను శుక్రవారమే ఆన్‌లైన్‌లో పెట్టేశాయి. వాటన్నింటిలోనూ ఈ మూవీ థియేటర్ ప్రింట్ దర్శనమిచ్చింది. దీంతో థియేటర్లకు వెళ్లి చూడలేని చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే అవకాశం ఉంది. అదే జరిగితే కలెక్షన్లపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అలాంటివి కనిపిస్తే రిపోర్టు చేయాల్సిన అవసరం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X