twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వకీల్‌సాబ్‌’పై ఫిర్యాదు.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు.. అసలేం జరిగిందంటే

    |

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్‌సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. కరోనా సమయంలో కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా దర్శకుడు శ్రీరాం వేణు, నిర్మాతలపై ఓ వ్యక్తి కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 3 | Pawan Kalyan | Venu Sriram

    తడిసిన అందాలతో కవ్విస్తోన్న ప్రియాంక చోప్రా

    నా ఫోన్ నంబర్‌ను ఉపయోగించారంటూ

    నా ఫోన్ నంబర్‌ను ఉపయోగించారంటూ

    ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. వకీల్ సాబ్ చిత్రంలో తన అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్‌ను ఉపయోగించారు. నా ఫోన్ నంబర్‌ను సినిమాలో ఉపయోగించడం వల్ల నాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అని సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని పేర్కొన్నారు.

    నా ఫోన్ నంబర్‌ను చూపిస్తూ..

    నా ఫోన్ నంబర్‌ను చూపిస్తూ..

    వకీల్‌సాబ్ చిత్రంలో భాగంగా ఓ సన్నివేశంలో విలన్ పాత్రధారి మార్పింగ్ చేసిన ఫోటోతోపాటు ఓ ఫోన్ నంబర్‌ను అంజలికి చూపిస్తాడు. ఆ ఫోన్ నంబర్ తనదేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా నిర్వాహకులు తన అనుమతి లేకుండా ఫోన్ నెంబర్ ఉపయోగించడం వల్ల తనకు లెక్కలేనని కాల్స్ అపరిచితుల నుంచి వస్తున్నాయి అని ఫిర్యాదులో సుధాకర్ పేర్కొన్నారు.

    అపరిచితులు కాల్ చేసి..

    అపరిచితులు కాల్ చేసి..

    నా ఫోన్ నంబర్‌ను సినిమాలో చూపించడం వల్ల నాకు కొందరు కాల్స్ చేసి దూషిస్తున్నారు. ఆ వేధింపులను నేను తట్టుకోలేకపోతున్నాను. నా ప్రైవసీకి తీవ్రమైన భంగం కలిగింది. ఈ క్రమంలో నా లాయర్ చేత నిర్మాతలకు నోటీసు పంపించాను. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు తన ఫిర్యాదులో సుధాకర్ పేర్కొన్నట్టు సమాచారం.

     సుధాకర్ ఫిర్యాదుపై

    సుధాకర్ ఫిర్యాదుపై

    ఇలాంటి వివాదాలు, ఫిర్యాదులు చోటుచేసుకోవడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కాదనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే సుధాకర్ ఫిర్యాదుపై నిర్మాతలు, దర్శకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    ఓటీటీలో వకీల్ సాబ్

    ఓటీటీలో వకీల్ సాబ్

    ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకుపైగానే వసూలు చేసింది. కరోనావైరస్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు ముఖం చాటేయడంతో సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తున్నది.

    English summary
    Power Star Pawan Kalyan's Vakeel Saab landed in another contraversy. As per media reports, Sudhakar named a person Petition filed in Panjagutta Police Station. He complained about using his phone number in movie without his permission.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X